Monday, March 7, 2011

నరకమీ నగరం

గాలి లేని శూన్యం
మట్టి కానరాని స్వార్ధం
లాభం ఆశించే స్నేహం
పచ్చ నోటుతో గడిచే కాలం

వున్నవి పోయాక
ఏవేవో తెచ్చుకోవాలి

అడుగడుగునా
జీవ శాస్త్రం గుర్తుస్తోంది

రసాయన శాస్త్రం
పూర్తిగా వంటబట్టింది

ప్రియమైన ప్రకృతీ
నిత్యమూ మహా నగరములో
ఉదయించు ..అస్తమించు ..
ప్లీజ్ నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు

గాలి ఆక్సిజన్ సిలిందర్లకు
నీరు మినరల్ వాటర్ బాటిళ్ళలో
పట్టుకుంటాం

జనసమ్మర్ధం ఎక్కువైనా కొద్దీ
ఇరుకుగా హాయిగా ఉంది

9490638222

0 comments:

Post a Comment