Saturday, November 10, 2012

ఎందుకు? ఏమిటి? ఎలా?


చీమల పుట్టలు తొలిచి 
పాముల పుట్టలు పొడిచి 
పంట చేలల్లో 
పరిగెత్తే సెలయేటిలో 

కొండలు పిండి చేసి 
అడవిని ఆక్రమించి  
వన్య ప్రాణులను భుజించి 
వనాలను  హరించి  

ఆకాశాహర్మ్యాలలో
గాలి కొని ..నీరు తిని 
దేహం ఒక అనారోగ్య దేవాలయమై 
 ఎందుకు? ఏమిటి? ఎలా?

 కళేబరాలను బతికించండి 
మోడులు చిగురింపజేయండి 
విత్తనం నిమిశాలలో కాయలు కాస్తుందేమో 
పుడుతూనే పిల్లాడికి ఉద్యోగం వస్తుందేమో 

 నిర్మూలించిన వాటికి నివాళి అర్పించండి 
అంతరించిపోతున్న వాటికి అంత్యక్రియలు 
కనిపించని కానలకు కర్మకాండలు 
 ఎందుకు? ఏమిటి? ఎలా?


పచ్చని ఆకులపై నువ్వు రాసిచ్చిన 
మరణ వాగ్మూలం 
ఇంకా రక్తమోడుతూనే ఉంది ..


 


 



 
 




 

Tuesday, October 2, 2012

అస్తి పంజరంలా ...


మాటే మంత్రం ..యంత్రం ..
తంత్రం ...కుతంత్రం ..
మౌనం ..ఇప్పుడు ప్రపంచ భాష

నయనం ప్రధానం ...
కనిపించేదంతా  ప్రదర్శనా ప్రభావం ..
అంధత్వానికీ ఓ ఆఫర్ ఉంది 

శ్రవణానందం
నిశ్శబ్ధమే
అధ్బుత సంగీతం 

చీము నెత్తురు లేకుండా ..
అస్తి పంజరంలా
బతకడం ఎంత హాయి

Saturday, September 15, 2012

నేను ....

నేను ....
దారి కానరాని ఎడారి నుంచి
నింగీ నేల కలిసిన  ఒకానొక ప్రాంతానికి

తీరంతో పోరాడి ..ఓడి ..
అలసి మరలిన సంద్రం వైపు

వెలుతురును జయించి ..
 స్థాపించిన చీకటి సామ్రాజ్యం మీదుగా 

ఒంటరితనం తోడుగా ...
నీడలా  వెంటాడుతూ

కామ ధేనువు కోసమో
కల్పవృక్షం కోసమో ..

కల సాకారం చేసుకునేందుకో  ...
కళాతృష్ణ  తీర్చుకునేందుకో...

విశ్వ జన విశ్పోటనము
నుంచి అణువునై ...
పరమాణువునై ...
నేను సాగిస్తున్న .....









Thursday, July 26, 2012

ప్రేమ సూత్ర...


తొ లి చూపో ..మలి వలపో
అన్నీ చూసుకో ..అర్ధం చేసుకో ..

ప్రేమించేందుకు సరిపడా
ఆస్తులు.. అంతస్తులు ..

పనికిమాలిన హృదయం
ఎంత విశాలంగా వుందో ..

ప్రేమ సూత్రకు
కామ సూత్రం మూలం ..
భావ ప్రాప్తికి  'అర్ధ' బలమిస్తే..
'అంగ' బలం మంగళ సూత్రం ఇచ్చింది

ప్రేమించే హృదయం
మళ్ళీ కవాటాలు తెరుచుకుంది
పతితలను ..పతివ్రతలను
అక్కున చేర్చుకునెందుకు

















Friday, July 13, 2012

కొన్ని అర్ధంలేని త్యాగాలు

ఆశ శ్వాసతో
కోరిక బతుకుతో
మనిషి మనసుతో
త్యాగం కోరుకోని బంధాలు

పరస్పర  అవకాశాలు
తప్పని సరైన అవసరాలు
ప్రేమగా నటిస్తూ
జీవితాంతం జీవిస్తాయి

ఉత్పత్తి ...
పునరుత్పత్తి లేని చోట
విత్తనానిదీ త్యాగమే
వీర్యానిదీ దానమే..

మేము మూర్ఖులం

ధని"కులం"
అర్భ "కులం"
మేము ..మీరు..
వీరు..వారు...
అందరం మూర్ఖులమే

అమెరికా వెళ్ళినా
ఆస్టేలియాకు వచ్చినా
ఇంగ్లాండ్లో ఉన్నా
ఈజిప్ట్ లో బతికినా

సామాజిక "వర్గాలుగా"
వీడిపోయి చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా ....



Monday, July 2, 2012

నీతులు ...బూతులు

రాతలన్నీ కోతలు
చేతలన్నీ రో తలు
 చెప్పేవి నీతులు
చేసేవి బూతులు

ఒక్కొక్కరిది ఒక సిద్ధాంతం
దాని కోసమే రాద్ధాంతం
అన్నీ వారికే   సొంతం
దోపిడీయే సాంతం 

కల నిదుర పోతోంది

కల నిదుర పోతోంది
కనుపాప కాపలాగా ..

చెలిమి చెదిరిపాయింది
కలిమి కారణంగా ...

ద్రోహంతో స్నేహం 
స్వార్ధమే గెలిచింది

స్వచ్చమైన ప్రేమకు
'నిరోద్' అడ్డుపడింది

పోరాడి గెలిచాను
ఓటమిదే  త్యాగం







Saturday, June 30, 2012

ఆ నలుగురు ఎవరో

మరణం ..మహా నిర్యాణం కావచ్చు
కుక్క చావూ కావచ్చు
చూడాలని ఉంది ..
ఆ నలుగురు ఎవరో 

Thursday, June 21, 2012

"వెన్నెల" వెలుగులు










 వెన్నెల
యూకేజీ
 డీ ఏ పీ స్కూల్
రాజాం 


Friday, May 25, 2012

కామన్ మాన్ ..క్వశ్చన్ బ్యాంకు

కామన్ మాన్ ..క్వశ్చన్ బ్యాంకు 

1. గుండెల్లో రైళ్ళు పరిగెత్తు తున్నాయి 
 పట్టాలు తప్పి పోతాయేమో 

2. కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి 
   ట్రాఫిక్  జాం అవుద్దేమో 

3. వాడు పెద్ద సౌండ్ పార్టీ 
    పంజాగుట్ట జంక్షన్లో ఇల్లా 

4. నన్ను చూస్తె ఉచ్చ పోస్తాడు 
    ఈయన వచ్చేసరికి బ్లేడరు నిండిపోద్దేమో 

5. గోడ కూలి బ్రాహ్మణ యువకుడు మృతి 
   పాపం ...బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐతే బతికేవాడేమో

సాగిపోవుటె బతుకు

సాగిపోవుటె  బతుకు 
ఆగిపోవుటె  చావు 
తొలగి తోవెవడిచ్చు 
త్రోసుకొనిపోవలయు ....ప్రజాకవి కాళోజీ 
ఇదే మాటను బాటగా చేసుకుని 
జర్నలిజంలో నవ వసంతాలు పూర్తి చేసుకున్న మిత్రులకు 
శుభాకాంక్షలతో....శ్రిచమన్ 

Wednesday, May 23, 2012

Monday, May 21, 2012

Saturday, March 31, 2012

క్లాస్ మేట్ .. ఫేస్బుక్ మీట్ ...

౩౦ ఏళ్ళ కింద నా క్లాస్స్ మేట్
ఇరవై ఏళ్ళ కిందట క్రికెట్ మేట్
పదిహేనేళ్ళ కిందట .....విశాఖపట్నంలో .......
ఈ రోజు జరిగింది ఫేస్ బుక్ మీట్

చదువులో పోటీ.. ఆటలో మేటి ..
గిల్లికజ్జాలకు మేమే సాటి ..

మనతో పాటు పెరిగిన దూరం
మాటలు లేని మౌనం
మరిచిపోని స్నేహం
అది ఎప్పటికీ శాశ్వతం
....శ్రిచమన్
.....చల్ల మధు ...

ఒంగోలు కొలీగ్స్ శ్రీశైలంలో

కర్నూలు మిత్రులు ..బెలూం గుహలలో

మధు యోధ

Tuesday, February 28, 2012

Sunday, February 12, 2012

జీతం కోసం అమ్మేసిన జీవితం

కంటి పాపం

తడారిన కళ్ళు
చుట్టూ నల్లని వలయాలు
కుదురుగా లేని మనస్సు
యవ్వనాన్ని కాటేసిన వయస్సు

జీతం కోసం
అమ్మేసిన జీవితం
కంటి మీద కునుకునూ కొనేసిన కాలం
అమ్మేసుకున్నది ఏంటో తెలియని లోకం

శ్రిచమన్


Thursday, February 9, 2012

విరాళాల విలాసం

విరాళం తీసుకుంటే లంచాలు అంటారా ?
చందాలు వసూలు చేస్తే దందాలు అంటారా ?

Monday, February 6, 2012

మొలకెత్తే పోరాటం

మొలకెత్తే పోరాటం
విత్తనం మొలకగా మారే ఆరాటం
మొక్క చెట్టుగా మారే పోరాటం
ఆట, పాట, మాట,
చదువు, బతుకు, బతికించే క్రమంలో
ఆకుపచ్చని కల ఆకారం
నింగీ నేలకు మధ్య గాలి నీరు తోడుగా
ఆత్మవిశ్వాసం ఆశ ..శ్వాసగా
సఫలమైన జీవిత సాకారం

Sunday, February 5, 2012

ఎందెందు వెతికినా ..నేనే ..

ఎందెందు వెతికినా ..నేనే ..

పేస్
బుక్ స్నేహం
మెయిల్ చిరునామా
ఆర్కుట్ జ్ఞాపకాలు
చాటింగ్ పలకరింపులు
యుట్యూబ్ మెమరీస్
ఎస్ ఎం ఎస్ కమ్యునికేషన్
మొబైల్ టాక్ టైం

Thursday, February 2, 2012

ఆలోచనలకు రెక్కలు కట్టి

ఆలోచనలకు రెక్కలు కట్టి లక్ష్యం వైపు ఎగరండి
- ఏ పీ జే అబ్దుల్ కలాం (హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్ధులకు ఇచ్చిన సూచన)

Sunday, January 29, 2012

ఆ(వి)గ్రహావేశాలు ..

నిలువెత్తు విగ్రహాలు
ఉవ్వెత్తున ఆగ్రహ జ్వాలలు
ఎవరిపైన ఈ కోపం
రాతి బొమ్మలేమి చేసాయి పాపం

బాపు భారత జాతి మదిలో
పదిలం నీ రూపు
నవ భారత రాజ్యాంగ నిర్మాత
జన హృదయ విజేత

ప్రతి మదిలో కొలువైన
మహాత్ములకేల ప్రతిమలు
ఆశతో మీ విగ్రహాల ఏర్పాటు
అతిరధులకు గ్రహపాటు

ఆకలి ఉంది
దాహం ఉంది
అనారోగ్యం ఉంది
అసమానతలు ఉన్నాయ్

అడగని వారికి విగ్రహాలెందుకు
అడిగేవారిపై ఆగ్రహమెందుకు
బొమ్మకు ప్రాణం ఎందుకు
సాయం అందించి సాటి మనిషితో సాగు ముందుకు

గాంధీని స్మరించు
సత్యం ధర్మం వెలిగించు
బాబా సాహెబ్ మాట
భావి భారత బాట

మహాత్ముల ఆశయాలే
నిలువెత్తు విగ్రహాలు
వారి త్యాగనిరతే
జన జాగృతి

రోడ్లకు అడ్డంగా
నిరాదరణకు నిదర్శనంగా
ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు
మహానుభావుల ఆశయాలకు తూట్లు


ఆకతాయి రాయితో
తాగుబోతు చేతులతో
ద్వంశం చేయలేడు
నా హృదయంలో విగ్రహాన్ని

అభిమానులూ
కుల సంఘాల సారదులూ
దీన జనోద్దారకులూ
మీకు విగ్రహాలు చేస్తున్న చిన్న విన్నపం

మీ కులం నిరుపేదకు చదువు చెప్పించండి
మీ మతం నిరాశ్రయుడికి నీడనివ్వండి
మీ ప్రాంతం వాడి కేకలు విని ఆకలి తీర్చండి
ఎవరికీ ఏమీ కాని రోగికి ప్రాణ భిక్ష పెట్టండి

-------ఇట్లు
విగ్రహాలు

Tuesday, January 24, 2012

ఒక సెలవ్ ..

ఒక విరామం
మరొక విశ్రాంతి
హాయిగా నిదుర పోతున్న కల
ఒంటరితనం ఉప్పొంగుతోంది

అలలు నావలై
సంద్రాన్ని ఈడుతున్నై
ఆటు పోట్లతో
తీరానికి తీరని వేదన

అందమైన శూన్యం
కోరికలేవీ లేనితనం
మాటలు రాని మౌనం
స్పందనలేని హృదయం


మరిచిపోయిన జ్ఞాపకంలా
విఫల ప్రేమలా
తిరిగి రాని యవ్వనంలా
శూన్యమైన ఖాళీలో ఒక సెలవ్....