Wednesday, May 7, 2014

నోటా మాట లేదు


బాబు వస్తే జాబు వస్తుంది.. కానీ బాబుకే జాబు లేదే. పదేళ్లుగా నిరుద్యోగిగా ఉన్న బాబు.. అధికారంలోకి వస్తే ఇస్తామంటున్న నిరుద్యోగ భ్రుతి ముందు ఆయనకే మంజూరు చేసుకోవాల్సిన పరిస్తితిలో ఉన్నారు. సీఎం ఇంటి పేరుతో ఉన్నాయన సీట్లు.ఱెత్లు వ్యవహారాలూ చక్కబెడుతుంటే.. సుజనాత్మక వ్యాపారి గల్లాపెట్టె తెరిచేశారు. వీళ్ళతో లాభం లేదనుకుని .. షూ వేసుకుని కూడా మడమ తిప్పని.. నోట్లో పాన్ వేసుకుని కూడా మాట తప్పని. జనం కోసమే పుట్టి తన కోసమే బతుకుతున్న ఆయన గురించి ఆలోచించా ..
 వచ్చేది మామయ్యా అని ముద్దు.. ముద్దు ప్రకటన ఇచ్చారు కానీ.. ఆ మామ కంసుడు. వచ్చేది మనుమడని ముసల్ది సంతోషంగా ప్రకటిస్తుంది.  కానీ ముసలోల్లు అని కూడా చూడకుండా మింగేసే మొసలి అని ముసలి దానికి తెలిసోచ్చే రోజుకి ఆ పండుటాకుకు నూరేళ్ళు నిండుతాయి. అన్నీ పోయి ఏపీ పేరుకు తగ్గట్టే ఒక్క ఆంధ్రప్రదేశ్ పేరు మిగిలిన రాష్ట్రానికి నాయకత్వం వహించే ఘన వారసత్వం వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీకి ఇద్దామంటే .. ఆ పార్టీ దగా స్టార్ చేతికి చిక్కింది, ఎవరైనా కొంటే  అమ్మనైనా అమ్మేసే స్థాయి అతనిది . ఆలినైన అద్దెకిచ్చే కక్కుర్తి గల ఘన నాయకుడు. దోమలు తాగేసినట్టు అభిమానుల రక్తం తాగేసి.. దానకర్నుడి అవతారం ఎత్తిన మహా నీచపు మనిషి. కూతురు ప్రేమించిన వాడు ఎక్కువ కులం  తక్కువ డబ్బు గల వాడు కావడంతో  విడాకులు ఇప్పించాడు.   కొడుకు ఎక్కువ డబ్బు ఏ కులమో తెలియని అమ్మాయిని ప్రేమిస్తే అంగరంగ వైభవంగా వివాహం చేశాడు ఇదీ ఈ  కథానాయకుడి వరస. ఏపీ జాన్ కపాడియా గాలైన సీమాంధ్ర ఎర్రి... పువ్వులు వాడు ఎన్నికల ప్రచారానికి వస్తే  చప్పట్లు కొట్టి స్వాగతం పలికారు.  కరచాలనం చేశేందుకు  ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఇక ఈ కొదమసింహం కొడుకు మామ, అల్లుకున్న  మేనల్లుడి మామలు తెరాస అభ్యర్ధులుగా పోటీ చేశారు. తమ్ములంగారు ఎన్డీఏ మద్దతుదారు. ఈయన గారేమో యూపీఏ కొనుక్కున్న మాట్లాడే బొమ్మాయె. ఎన్ని రాష్ట్రాలైనా కానీ.. ఎక్కడ ఏ ప్రభుత్వమైనా రానీ ఏ ఇబ్బందీ రాణి విధంగా బ్రాకెట్ వేశాడు. వీడు గాల్లో ఊపిన చేయిని అభయహస్తం అనుకుని పొరబడితే.. భశ్మాసుర హస్తమై రాయల సీమ కర్ణాటక వాళ్లకు, ఉత్తరాంధ్ర ఒరిస్సా వాళ్లకు ఏంటో కొంతకి.. అమ్మి పడేస్తాడు.. అందుకే ఓటేసేందుకు వెళ్లి కసిగా ఈవీఎం లో గుర్తులన్నింటినీ గుర్తు పెట్టుకుని పగలకొడదామనుకున్న .. ఎదురుగా ఎన్నికల నిబంధనలు కనిపించాయి.. ఆ పై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన భద్రతా సిబ్బంది బందూకులతో కనిపించారు. నోట మాట పెగల్లేదు..నోటా మీట నొక్కి నోరు మూసుకుని ఇంటికొచ్చా..