తొ లి చూపో ..మలి వలపో
అన్నీ చూసుకో ..అర్ధం చేసుకో ..
ప్రేమించేందుకు సరిపడా
ఆస్తులు.. అంతస్తులు ..
పనికిమాలిన హృదయం
ఎంత విశాలంగా వుందో ..
ప్రేమ సూత్రకు
కామ సూత్రం మూలం ..
భావ ప్రాప్తికి 'అర్ధ' బలమిస్తే..
'అంగ' బలం మంగళ సూత్రం ఇచ్చింది
ప్రేమించే హృదయం
మళ్ళీ కవాటాలు తెరుచుకుంది
పతితలను ..పతివ్రతలను
అక్కున చేర్చుకునెందుకు