Wednesday, December 31, 2014

కళా మతల్లీ

తల్లి పాల కొద్దీ 
రొమ్ము గుద్ది
టెట్రా ప్యాక్ 
సొగసులద్ది
సొమ్ముకు
అమ్ముకుంటున్న
బిడ్డలారా
కు.ని. చేయించుకున్న
కళా మతల్లికి
పుట్టిన ముద్దు బిడ్డలారా
గొడ్రాలి కడుపున
పడ్డ కణితులార
బిడ్డని భ్రమ పడుతున్న తల్లి
కడుపులో పెరుగుతున్న
క్యాన్సర్ గడ్డలారా
వెండి తెరపై వాలిన గద్దలారా
చాలించండి మీ కపట నాటకాలు
(సినిమా ఒక కళ .. మతల్లీ అంతే శ్రేష్టమైనదని అర్థం. కళా మతల్లీ అంటే కళలో శ్రేష్టమైనది. అంతే కానీ సినీ పరిశ్రమ ఒక తల్లీ కాదు .. ఈ బాబులు.. వాల్లబ్బలు ఈ తల్లికి పుట్టిన పిల్లలూ కారు. ఆడియో ఫంక్షన్లు, సక్సెస్ మీట్ లో ప్రగల్భాలు, మోసకారి మాటలు, నక్క సిగ్గు పడే నటనలు, వినలేక/.. అన్నింటికంటే చెత్త సినిమాలు చూడలేక.. )
(శ్రీచమన్)
.... 9490638222

............. బిడ్డ "సెల్"లో ఉన్నాడు ...............


కనిపెంచిన అమ్మైనా
కన్న తండ్రైనా 
మాటల్లేవ్ మాట్లాడుకోడాల్లేవ్ 
ఓన్లీ వాట్సాప్
ఫీలింగ్స్ అయినా
షేరింగ్స్ కానీ
చావైనా పుట్టుకైనా
ఓన్లీ టైమ్ లైన్
మా ఇంటి మహా రాజు
మాయమయ్యాడు
వంట గది రారాజు
ఆ దిక్కే మరిచాడు
నా కోసం ఏం వండావమ్మా
అని అడగడమే మానేశాడు
పిజ్జా హట్ లో స్పూన్ ముద్దలు
కే ఎఫ్ సీ లో ఫోర్క్ తో కుస్తీలు
అమ్మ అని పిలిపించుకుని
ఎన్ని రోజులైంది
టచ్ స్క్రీన్ చేతికిచ్చి
మాతృ స్పర్శకు దూరమయ్యాడు
బాబూ ...మాటాడు ...
మాటలు ఖర్చు అయిపోతున్నాయి
మొబైలులో బాలెన్సు లేదమ్మా
ఫ్రీ టాక్ టైమ్ ఎప్పుడొస్తుందో
.
బిడ్డ సెల్ లో ఉన్నాడు
బెయిల్ రాని జైలులో
జీవిత ఖైదీ
క్షమాభిక్ష ఎప్పుడో
చార్జింగ్ తోనే నాలుకకు సిగ్నల్
మెమరీ కార్డుంటే అమ్మ వాల్ పేపర్
అప్పుడప్పుడూ స్క్రీన్ పై
వచ్చి పోతుంది
ఇప్పుడు మాట చాలా విలువైనది
కొనుక్కున్న మాటలు
అమ్ముకోవడానికే
ప్రీ పెయిడ్ గానో.. పోస్ట్ పెయిడ్ తోనో
మానవ సంబంధాలకు
సెకన్ల బిల్లింగ్ ..నిమిషాల ఆఫర్
నైట్ బేలన్స్.. అన్ లిమిటెడ్ టాక్ టైం
లైఫ్ టైం వ్యాలిడిటీ ...
మనసుకు మాటలు రావు
మనిషితో మాటాడాలంటే
ఏదో ఒక నెట్ వర్క్ లో ఉండాలి
ఏ ప్యాకేజీలో ఉన్నావో చెప్పాలి
ఒక్కోసారి లైన్లన్నీ బిజీ..
మరోసారి కాల్ వెయిటింగ్
స్విచాఫ్ ..లేదా ఔటాఫ్ కవరేజీ
మీరు డయల్ చేసిన నంబర్ ఒక సారి సరి చూసుకోండి
శ్రీచమన్ .. 30-12-2014 (9490638222)

Wednesday, December 10, 2014

సినిమా సూపిత్త ..

నవ్వుల వెనుక 
నిశీధిలో విషాదం
లైట్స్ ఆన్
అందం లోపలి పొరల్లో
ఎన్ని ముడతలు
స్టార్ట్ యాక్షన్
వాగులు వంకలను
కలిపే కన్నీటి చారిక
అందుబాటులో గ్లిజరిన్
కళ్ల కింద నీటి సంచుల్లో
ఉప్పునీటి సంద్రం
ఈ దాహం తీరనిది
వెండితెరపై వెలుగులు
వన్నె తగ్గని అందాలు
ప్రతిసృష్టికర్త మేకప్ మెన్
కురుల మెరుపులు
వాలు జడ వయ్యారం
సిగ్గు వదిలిన విగ్గు
ఎద సిరుల విరుపులు
అరవైలో ఇరవై
సిలికాన్ సిత్ర్రాలు
పెదాల పదాలు
పాదాల నృత్యాలు
కృష్ణానగర్ ప్రొడక్షన్స్
ఎడతెగని పోరాటం
రెమ్యూనరేషన్ కోసం
స్టంట్ మాస్టర్ ఆరాటం
సకల కళల ఆకారులు
ఏదో ఒక యూనియన్
సభ్యత్వం
మేకప్ లేకపోతే ప్రేక్షకులతోపాటు
కుటుంబసభ్యులూ కూడా
గుర్తు పట్టలేకపోతున్నారు
పచరంగుల సాంఘిక
చిత్రంలో విశ్రాంతి లేదు
శుభం కార్డు.. బోర్డు తిరగబడింది
..........శ్రీచమన్ ....... 09. 12. 14

Sunday, November 16, 2014

లుక్స్.. సెక్స్

కలయిక కల అయినప్పుడు 
నిదుర కూడా ప్రేమించదగినదే
కోరికల కలవరింతలను 
కోడి కూత తట్టి లేపింది
చాప నా సహచరి
దిండు ఓ ప్రేయసి
లుక్సూ సెక్స్ లో
ప్రధాన భంగిమ
ఎన్ని కలలు
స్కలించాయి
మరెన్నికోరికలు
ప్రసవించాయి
మంచానికి మనస్సు ఉంటే
వెల్లకిలా పడిన
నీ హృదయంపై పడి
తను తనువు చాలించేది
ఏ కాంతా చూడని
ఏకాంతంలో
యవ్వనాన్ని
ప్రేమించింది నపుంసకత్వం
ప్రేమికుడివీ నువ్వే
ప్రేయసీ నువ్వే
తాజ్ మహల్
అవసరమే రాదు
(శ్రీచమన్ )9490638222

Sunday, September 21, 2014

మరణం నా జన్మ హక్కు


కలుస్తారో .. కల గంటారో
కాలు జారుతారో
అంతా మీ ఇష్టం
చిలకప్రశ్న వేస్తారో ..జాతకం చూస్తారో
అండ పిండానికి అంకురార్పణ చేస్తారో
అంతా మీ ఇష్టం
పిండనిర్ధారణ వరకూ వస్తారో
మందు బిళ్ళతో
పిండ ప్రదానం చేస్తారో
అంతా మీ ఇష్టం
నడక, నడత నేర్పుతారో
నరకం చూపుతారో
అంతా మీ ఇష్టం
చదివిస్తారో
చట్టుబండలు చేస్తారో
మీ స్వయం నిర్ణయాధికారం
ప్రేమిస్తారో .. ద్వేషిస్తారో
లింగ భేదం చూపిస్తారో
మీ విచక్షణాదికారం
నెలలో మూడు రోజుల వెలికి
ప్రకృతి సిద్ధమైన లైసెన్సు
ఆశీర్వదిస్తారో ..ఆంక్షలు విదిస్తారో
అంతా మీ ఇష్టం
పెళ్లి చూపుల సంతకు తరలిస్తారో
ప్రేమించినోడి చెంతకు చేరుస్తారో
అంతా మీ ఇష్టం
కట్నానికి బలిస్తారో .. వేధింపులతో వేటేస్తారో
అనుమానాలతో అంతమొందిస్తారో
అంతా మీ ఇష్టం
ఆడమ్ అండ్ ఈవ్
ఎవడ్రా మిమ్మల్ని కలవనిచ్చింది
ఒరే ఆడమ్ .. ఆడోళ్ళ ఉసురు తీశావ్ గదరా
కండోమ్ తో ఉరేసి .. టాబ్లెట్లతో చిదిమేసి
కత్తులతో కోసేసి .. కళ్ళు తెరవక ముందే
కారుణ్య మరణం ప్రసాదిస్తున్నారు
మొండిగా కళ్ళు తెరిస్తే
నర్సరీ నుంచి నడవలేని ముసలమ్మా వరకూ
కన్ను మూయాల్సిందే
కామాంధులకు బలి కావాల్సిందే
అగ్గిపుల్ల.. నైలాన్ తాడు
పురుగు మందు.. నేల బావి
తలదిండు.. పడక మంచం
కత్తి .. యాసిడ్
నన్ను చంపేందుకు ఎన్ని ఆయుధాలు
మరణం నా జన్మ హక్కు
............... శ్రీచమన్ (20-09-2014)

Saturday, September 20, 2014

వీడు ఎందుకు "ఆగడు" అంటే ...

 ఎవరేమనుకున్నా "ఏపీ" అంటే నాకు ఏదో షార్ట్ ఫార్మ్ గుర్తొస్తుంటుంది. ఆన్ లైన్ సినిమా అందుబాటులోకొచ్చిన ఈ రోజుల్లో.. పాత సినిమాను పేరు మార్చి రిలీజ్ చేసినా కొనేందుకు క్యూలో నిల్చుని పర్సు పోగొట్టుకుని.. సినిమా టికెట్ దొరికిందన్న హ్యాపీగా గడిపేసే మనుషులు ఉన్నన్ని రోజులూ "ఆగడు"లాంటి సినిమాలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. బ్రహ్మానందం కోసం ఈలలు చప్పట్లు కొట్టే ప్రేక్షకులు, బ్రాహ్మి ట్రాక్ తో విజయం సొంతం చేసుకునే దర్శకులున్నంత కాలం తెలుగు సినిమా ఏమైపోద్దో అని పెద్దలెవరూ బెంగ పడక్కర్లేదు. పిల్లలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. హెయిర్ వీవింగ్ జుట్టుకు నిగ నిగలు ఎక్కువట.. హీరో పెట్టుకున్నది విగ్గు అన్న కనీసం జ్ఞానం లేని సినీ పిచ్చోళ్ళు మా అభిమాన నాయకుడిలా హెయిర్ స్టైల్ కావాలని సిగ్గు లేకుండా సెలూన్ వాళ్ళను అడిగే వాళ్ళు ఉన్నంతకాలం వజ్రోత్సవాలేం ఖర్మ ఉక్కోత్సవాలు కూడా జరుపుకోవచ్చు. ఆగడు, సినిమా కటౌట్ తొలగించారని..కాలువలో దూకాడని మీడియాలో చూశాను. కారణం కటౌట్ అయ్యి ఉండదు. వీరాభిమాని కదా, అత్యుత్సాహంతో ప్రివ్యూ చూసి.. ఫస్టాఫ్ గబ్బర్ సింగ్, సెకండాఫ్ దూకుడు, మద్యలో పోకిరి మిక్సింగ్ చూసి తట్టుకోలేక దూకి ఉంటాడు. ఆ అభిమానే కనుక చనిపోయి ఉంటే బాధ్యులలో ఒకడు తమన్. కర్ణ కఠోర సంగీతం పాటల్ని మృత్యువులా మింగేసింది. వినేందుకు కష్టం.. నిర్మాతకు నష్టం.. దర్శకులకు ఇష్టం ఇదీ తమన్ బాణీ. తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నప్పుడే పాటల రచయితలు హత్యకు గురైనట్టే. రెమ్యూనరేషన్ మత్తులో ఉన్న లిరిక్ రైటర్లు తమ జీవితాలు పణంగా పెట్టి తమన్ తో పని చేస్తున్నారు. తెలుగు సినిమా నిర్మాతలు వాళ్ళు తీసిన సినిమానే మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు పెట్టిన డబ్బు కస్టపడి సంపాదించినది అయ్యి ఉండక పోవచ్చు. లేకపోతే ఇదేమి వైపరీత్యం. శ్రీను వైట్లని మాత్రం అభినందించాలి.... తనకు నచ్చని వ్యక్తులను, క్యారెక్టర్లు చేసిబాక్సాఫీస్ బాద్షా అవుతున్నాడు. ఈయన కెమెరా సూటి మనిషి.. వైట్ల గారు ఎంత కరెక్టుగా ఉంటారో నాకు తెలియదు కానీ, సినిమా బాబుల విపరీత చేష్టల్ని..స్క్రీన్ పై చూపిస్తున్నారు. విఠలాచార్య సినిమాలో నటించేటప్పుడు హీరోలు ఏ మాత్రం తోక జాడించినా శీను మారిపోయేదట. కథానాయకుడిని చంపేసి కుక్కనో, నక్కనో, కోతినో, పామునో, ఎనుగునో సృష్టించే వాడట. వైట్ల కూడా తనకు నిజ జీవితంలో, సినీ ఇండస్ట్రీలో ఎదురైన మనుషుల్ని, వారి విపరీత చేష్టల్ని కామెడీ ట్రాక్ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు హిట్ ఫార్ములా అయ్యింది. సక్సెస్ ని స్వార్ధానికి ఉపయోగించుకుని తన మాట వినని వాళ్ళను, నచ్చని వాళ్ళను విఠలాచార్య లా సాధిస్తున్నాడని ఓ టాక్ ఉంది. ఏదేమైనా "ఏపీ" ప్రజలారా .. మూడు పాత సినిమాలను ఒకే టికెట్ పై చూసినందుకు మీకు అభినందనలు.. తాము తీసిన సినిమాని అదే హీరోతో మల్లె తీసినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. గబ్బర్ సింగ్ అంత్యాక్షరిని ఎవరు మీలో పోటుగాడుగా మార్చినా, దూకుడు పద్మశ్రీ ఎపిసోడ్ ని డిల్లీ సూరి పాత్రతో డ్రామా ఆడించినా క్రెడిట్ అంతా శ్రీను వైట్లదే. అయితే దూకుడు ఆయన సినిమా కృతజ్ఞతలు చెప్పుకోవక్కర్లే. మరి గబ్బర్ సింగ్, పోకిరి డైరెక్టర్ల కైనా ధన్యవాదాలు చెప్పాలి కదా? చివరాఖరికి ఏపీ, టీఎస్ ప్రజలంతా కలిసి ఆ మూడు సినిమాలకు కలిపి వచ్చిన కలెక్షన్లు "ఆగడు"కు కురిపిస్తే.. మళ్ళీ 200 కోట్లతో దూకుడు ,గబ్బర్ సింగ్, పోకిరి, "ఆగడు"లతో కలిపి మరో సినిమా శ్రీను వైట్ల తీస్తాడని నేను ప్రేక్షకులకు హామీ ఇస్తున్నాను.. 

Thursday, August 7, 2014

నాకో షుగర్ లెస్సూ...

చీకట్లను చీల్చుకుంటూ
వెలుతురు దారి
చెమటలు కక్కుకుంటూ
అలుపెరగని ఓ బాటసారి
అన్నీ వాడి పారేసేవే
కొన్ని మరకలు
మరికొన్ని గురుతులు
చిందర వందరగా వ్యర్ధాలు
మార్నింగ్ వెరీ ఫ్రెస్సూ
ఈవెనింగ్ వెరీ స్ట్రెస్సూ
ఉరుకు పరుగుల జీవితం
ఆశే ఆసాంతం
పేరు మధురం
తీరు దుర్భరం
మనిషికి విరోధి
అదే ఈ వ్యాధి
చక్కెర వ్యాధి
షుగర్ జబ్బు
డయాబెటిక్ ..
ఎలా పిలిచినా
తీయగా పలుకుతుంది
చేవను మింగేసి
చేదును మిగిలిస్తుంది
ఆకలిని తీర్చే అన్నం విషమై
తనువెల్లా తూట్లు పొడుస్తుంటే
ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన
ప్రియురాలు గొంతు నులిమేస్తున్నట్లుంది
నిరంతరం చావు భయంతో
తింటూ .. బతుకుతూ
తీయనైన రోగాన్ని
హాయిగా జయించాలనే
ఈ వేకువ పోరాటం
నీడ కూడా జాడ చూపని వేళలో
జీవితాన్ని కాచి వడపోసిన వాడిలా
నరకాన్ని అధిగమించేందుకు
డయాబెటిక్ ఎడారిలో
నడక దారి
కంకర అడవుల్లో వాకింగ్
కింగ్ లను సేదదీర్చేందుకు
దారి పక్క చెట్టు కింద
అభివృద్ధి మింగేయకుండా
వదిలేసిన గుర్తులా
ఖరీం భాయి చాయ్ డబ్బా
నాకో షుగర్లెస్సూ...
అంటూ ఆర్డర్లు ..


శ్రీచమన్... 9490638222

Saturday, July 12, 2014

కుక్కకూ ఓ లెక్కుంది


 తిక్కకు లెక్క సినిమాల్లో విన్నాం. కుక్కకు లెక్క మాత్రం నేను కళ్ళారా చూశాను. దాని లెక్కకు పక్కటెముకలు లెక్కకు మిక్కిలిగా విరిగి పోవాల్సింది.. జస్ట్ మిస్. అంతా  డాగ్ దయ. ఓ బహుళ అంతస్తుల భవనానికి కాపలాగా వీరబొబ్బిలి ఠీవితో ఓ శునకం ఉంది. తనకు యజమాని అప్పగించిన భాద్యతలను ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగిలా భయభక్తులతో నిర్వహిస్తోంది అది. బాగా బలిసినోల్ల సీమ కుక్క.. ఊర కుక్కతో జత కట్టిన ఓ బలహీన క్షణంలో జన్మించిన ఆనవాలు.. రంగులోనూ, ఆహార్యంలోను అక్కడక్కడా కనిపిస్తున్నాయా కుక్కలో..అపార్ట్మెంట్ సెల్లార్ కేంద్రంగా కుక్కగారు తన విధి నిర్వహణను కొనసాగిస్తున్నారు.  ప్రతి రోజు అదే దారిలో నేను అద్దెకుండే గృహానికి రాకపోకలు సాగిస్తూ ఉన్నాను. తెలిసిగానీ, తెలియకగానీ నేను ఏనాడూ ఆ  కుక్కగారిని ఒక మాట అనలేదు. శునక విశ్వాసాన్ని శంకించనూ లేదు. ఎవెరీ డాగ్ హేజ్ ఇట్స్ ఓన్ డే .. దట్స్ డే .. అదే రోజు ద్విచక్ర వాహనంపై ఇంటి వైపు దూసుకుపోతున్న నా పైకి వేట కుక్కలా దూకింది. తప్పించుకునేందుకు బండిని స్పీడ్ గా పోనిచ్చాను. అయినా వెంటాడింది. యాక్సిలేటర్ తిప్పా. అతివేగంతో బండి నా చేజారింది. కాల బైరవుడి లక్ష్యం నెరవేరింది. కింద పడిన నా వైపు విజయోన్మాదంతో చూసి తన  డెన్ కి చేరింది. ఫ్రాక్చర్ తప్పి గుడ్డలు చిరిగి.. బండి పార్టులు విరిగాయి.  
    నా జీవితంలో ఎవ్వరిని ఏమీ చేయలేకపోయాను. చివరికి ఓ కుక్క చేతిలో కూడా.. వంటిపై గాయాలు, కుక్కపై  ప్రతీకారం తీర్చుకోవాలనే ద్యాసతో  నిద్రలేని రాత్రులు గడిపాను. మిత్రులకు  ఫోన్ చేసి గోడు వెళ్లబోసుకున్నాను. ఓదార్చుతారేమోనని ఎదురు చూశానులా . నా కుక్క గొడవ వారికి సిటీ లైఫ్ లో  ట్రాఫిక్ సమస్యలాగే చికాకు పెట్టి ఉంటుంది. మిత్రులు ఇచ్చిన ఫోన్ నెంబర్తో  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డాగ్ సెల్ కు ఫోన్ చేశాను. మీది వీధి కుక్క సమస్య అయితే 1 నొక్కండి.. ఇంటి కుక్క సమస్య అయితే 2 నొక్కండి. గజ్జి కుక్క ప్రాబ్లెం అయితే 3 నొక్కండి.. అనే అందమైన ఆడగొంతు  ఐవీర్ లో వినిపించిందే వినిపించి ప్రీ పెయిడ్  బాలెన్స్ ఖాళీ  చేసేసింది. రోజులు గడిచిపోతున్నాయి. ఒక బేపిని  (ఉత్తరాంధ్రలో కుక్కని ఇలాగే పిలుస్తారు ) ఏమీ చేయలేకపోయాను. కుంటుతూ వెళుతున్న నన్ను అది వేళాకోళంగా చూస్తోంది. ఎట్టకేలకు డాగ్ స్క్వాడ్ హెడ్ నెంబర్ పట్టా.. జర్నలిస్ట్ మిత్రుడి సిఫారసుతో  ఫోన్ కొట్టా.. అడ్రస్ తీసుకున్నారు. వ్యాన్, వలతో చేరుకున్నారు. బహుళ అంతస్తుల భవనం వాచ్ మెన్ తన తోటి ఉద్యోగిని తీసుకెల్లొద్దని వేడుకున్నాడు . డాగ్ స్క్వాడ్ సిబ్బందితో గొడవ కూడా పడ్డాడు. విధి నిర్వహణే పరమావధిగా భావించే డాగ్ స్క్వాడ్ కుక్కను వలలో బంధించి వ్యాన్లో వేశారు. వీధి చివరకు వెళ్లి వ్యాన్ ను ఓ మూల ఆపి నాకు ఫోన్ చేశారు. '"సార్ .. కుక్కను పట్టేశాం. అపార్ట్ మెంట్ వాళ్ళు చాల గొడవ చేశారు. అయినా మీరు మా పెద్ద సారూ రికమెండేషన్ కదా. అందుకే కుక్కని వదలలేదు". అని చెప్పారు. సార్ చాయ్ పైసలు .. ఇవ్వరూ అని రిక్వెస్ట్ చేశారు. వ్యాన్ పైకెక్కి నన్ను వెంటాడి వేధించిన కుక్క నిస్సహాయంగా వలలో గిలగిల కొట్టుకుంటుంటే చూసి..దెబ్బకు దెబ్బ ఎలా తీసానో చూశావా అంటూ కాలరెగరేశాను. జేబులోంచి 2 వంద నోట్లు తీసి డాగ్ స్క్వాడ్ కి ఇచ్చాను. నేను మొదటి సారి విజయం సాధించాను. నా జర్నలిస్ట్ పరపతిలో నకిలీ వీరబోబ్బిలిని ఎలా పట్టించానో అడిగిన వారికి.. అడగని వారికి చెప్పి విజయ గర్వంతో విర్రవీగాను. 
    మూడు రోజులు గడిచిపోయాయి. అపార్ట్మెంట్ ముందు నుంచీ రోజు వెళుతున్నాను. కుక్కని ఎందుకు పట్టించావని ఎవరైనా అడిగితే.. ప్రెస్ ప్రివిలేజ్ ని దెబ్బ తీసిన ఎవరికైనా ఇదే గతి పట్టిస్తానని చెబుదామనుకున్నాను. ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. పట్టించిన నాకు, దొరికిపోయిన కుక్కకు తప్పించి .. ఈ ప్రపంచం ఈ విషయం పట్టించుకోవడం మానేసింది.  ఎవెరీ డాగ్ హేజ్ ఇట్స్ ఓన్ డే అగైన్. ద గ్రేట్ డాగ్ రిటర్న్స్. అదే కుక్క, అదే అపార్ట్మెంట్ ముందు దర్శనమిచ్చింది. మెడలో ఓ బెల్ట్ కొత్తగా వచ్చింది. అదే దానికిప్పుడు లైసెన్సు. ఇప్పుడు జర్నలిస్ట్ కాదు... ఆడిని పుట్టించిన జర్నలిజం డిపార్ట్మెంట్ హెడ్ కూడా దాని బెల్ట్ పీక లేడిప్పుడు. కుక్క లెక్క తెలియక తిక్క లేచింది.  డాగ్ స్క్వాడ్ హెడ్ కి ఫోన్ చేశాను. సార్ .. మీరు మా ఉద్యోగాలకు ఎసరు పెట్టేలా ఉన్నారు. పెంపుడు కుక్కను అక్రమంగా తీసుకొచ్చామని మాపై కేసు పెడతామని బెదిరించారు. మీరేమో జర్నలిస్ట్.. కుక్క యజమానేమో హైకోర్టు లాయర్. పట్టుకుంటే ఆయనకు కోపం.. విడిచిపెడితే మీకు రోషం.. అంటూ చిన్నపాటి క్లాస్ పీకాడు. సార్ కుక్కన్నాక అరుస్తాది, కరుస్తాది.. వినీ విన్నట్టు, ఏడిచీ ఏడవనట్టు వేల్లిపోవాలే గానీ ఇలా పట్టించి మమ్మల్ని ఇరుకున పెట్టొద్దని సలహా ఇచ్చాడు. ఈ సారి కుక్క అరిచినా,కరిచినా దాని యజమాని ఎవరో తెలుసుకోవాలని సూచించాడు. కుక్క లెక్క తెలిసింది. అదే వీధిలోంచి రోజూ వెళుతున్నాను. కుక్క గారి విధి నిర్వహణకు ఎటువంటి ఆటంకం కలగకుండా, ఆగ్రహానికి గురికాకుండా నా విధి నేను నిర్వర్తిస్తున్నాను.  


  

Wednesday, May 7, 2014

నోటా మాట లేదు


బాబు వస్తే జాబు వస్తుంది.. కానీ బాబుకే జాబు లేదే. పదేళ్లుగా నిరుద్యోగిగా ఉన్న బాబు.. అధికారంలోకి వస్తే ఇస్తామంటున్న నిరుద్యోగ భ్రుతి ముందు ఆయనకే మంజూరు చేసుకోవాల్సిన పరిస్తితిలో ఉన్నారు. సీఎం ఇంటి పేరుతో ఉన్నాయన సీట్లు.ఱెత్లు వ్యవహారాలూ చక్కబెడుతుంటే.. సుజనాత్మక వ్యాపారి గల్లాపెట్టె తెరిచేశారు. వీళ్ళతో లాభం లేదనుకుని .. షూ వేసుకుని కూడా మడమ తిప్పని.. నోట్లో పాన్ వేసుకుని కూడా మాట తప్పని. జనం కోసమే పుట్టి తన కోసమే బతుకుతున్న ఆయన గురించి ఆలోచించా ..
 వచ్చేది మామయ్యా అని ముద్దు.. ముద్దు ప్రకటన ఇచ్చారు కానీ.. ఆ మామ కంసుడు. వచ్చేది మనుమడని ముసల్ది సంతోషంగా ప్రకటిస్తుంది.  కానీ ముసలోల్లు అని కూడా చూడకుండా మింగేసే మొసలి అని ముసలి దానికి తెలిసోచ్చే రోజుకి ఆ పండుటాకుకు నూరేళ్ళు నిండుతాయి. అన్నీ పోయి ఏపీ పేరుకు తగ్గట్టే ఒక్క ఆంధ్రప్రదేశ్ పేరు మిగిలిన రాష్ట్రానికి నాయకత్వం వహించే ఘన వారసత్వం వందేళ్ళ చరిత్ర కలిగిన పార్టీకి ఇద్దామంటే .. ఆ పార్టీ దగా స్టార్ చేతికి చిక్కింది, ఎవరైనా కొంటే  అమ్మనైనా అమ్మేసే స్థాయి అతనిది . ఆలినైన అద్దెకిచ్చే కక్కుర్తి గల ఘన నాయకుడు. దోమలు తాగేసినట్టు అభిమానుల రక్తం తాగేసి.. దానకర్నుడి అవతారం ఎత్తిన మహా నీచపు మనిషి. కూతురు ప్రేమించిన వాడు ఎక్కువ కులం  తక్కువ డబ్బు గల వాడు కావడంతో  విడాకులు ఇప్పించాడు.   కొడుకు ఎక్కువ డబ్బు ఏ కులమో తెలియని అమ్మాయిని ప్రేమిస్తే అంగరంగ వైభవంగా వివాహం చేశాడు ఇదీ ఈ  కథానాయకుడి వరస. ఏపీ జాన్ కపాడియా గాలైన సీమాంధ్ర ఎర్రి... పువ్వులు వాడు ఎన్నికల ప్రచారానికి వస్తే  చప్పట్లు కొట్టి స్వాగతం పలికారు.  కరచాలనం చేశేందుకు  ఒకరిపై ఒకరు కలబడ్డారు. ఇక ఈ కొదమసింహం కొడుకు మామ, అల్లుకున్న  మేనల్లుడి మామలు తెరాస అభ్యర్ధులుగా పోటీ చేశారు. తమ్ములంగారు ఎన్డీఏ మద్దతుదారు. ఈయన గారేమో యూపీఏ కొనుక్కున్న మాట్లాడే బొమ్మాయె. ఎన్ని రాష్ట్రాలైనా కానీ.. ఎక్కడ ఏ ప్రభుత్వమైనా రానీ ఏ ఇబ్బందీ రాణి విధంగా బ్రాకెట్ వేశాడు. వీడు గాల్లో ఊపిన చేయిని అభయహస్తం అనుకుని పొరబడితే.. భశ్మాసుర హస్తమై రాయల సీమ కర్ణాటక వాళ్లకు, ఉత్తరాంధ్ర ఒరిస్సా వాళ్లకు ఏంటో కొంతకి.. అమ్మి పడేస్తాడు.. అందుకే ఓటేసేందుకు వెళ్లి కసిగా ఈవీఎం లో గుర్తులన్నింటినీ గుర్తు పెట్టుకుని పగలకొడదామనుకున్న .. ఎదురుగా ఎన్నికల నిబంధనలు కనిపించాయి.. ఆ పై ఈశాన్య రాష్ట్రాలకు చెందిన భద్రతా సిబ్బంది బందూకులతో కనిపించారు. నోట మాట పెగల్లేదు..నోటా మీట నొక్కి నోరు మూసుకుని ఇంటికొచ్చా..

Friday, March 28, 2014

బస్సుయాత్రకు "చిరు" ప్యాకేజీ?

బస్సుయాత్రకు "చిరు" ప్యాకేజీ?
తన సొంత బేనర్ అయిన అంజనా ప్రొడక్షన్ సినిమాలో నటించినా రెమ్యునరేషన్ ముక్కు పిండి మరీ ఏరియా హక్కుల రూపంలోనైనా చిరంజీవి తీసుకుంటారని సినీవర్గాలలో ప్రచారంలో ఉంది.  సినిమా పోయి సొంత తమ్ముడు అప్పుల పాలైపోయినా తీసుకున్న సొమ్ము తిరిగి ఇచ్చిన సందర్భాలూ లేవట.  ఆరెంజ్ సినిమాయే దీనికి చక్కని ఉదాహరణ అని సినీ విమర్శకులు చెబుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. 13 జిల్లాల సీమాంధ్రను కక్ష కట్టి అన్యాయం చేసిన కాంగ్రెస్ ను తాను రక్షిస్తానంటూ బస్సులో బయలు దేరారీ మెగాస్టార్.
    ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఏరియాల వారీగా టికెట్లు అమ్ముకుని ఎన్నో కుటుంబాలను, మరెందరో అభిమానులను నిలువెల్లా ముంచి కాంగ్రెస్ అనే నదిలో విలీనమైపోయాడీ ముఠామేస్త్రీ. రెండు మంత్రి పదవులు, ఒక కేంద్రమంత్రి పదవి, రాజ్యసభ సీటుకు ప్రజా రాజ్యం ఆడియో, వీడియో, శాటిలైట్ హక్కులను అమ్మేసిన మొనగాడు. కిరణ్ కుర్చీ దిగితే ఎక్కేద్దా మనుకుని కాపలా కాసి కుదరకపోవడంతో కాంగ్రెస్ రక్షకుడి అవతారం ఎత్తాడు. రాష్ట్ర విభజన తప్పే కాదని, సీమాన్ధ్రకు అన్యాయం చేయడం కూడా తన సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం ఏమీ కాదంటున్నాడు. కొనే వాడు ఉన్నప్పుడు టికెట్ అమ్మటం ఎంత కరెక్టో, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవుతున్న పరిస్థితుల్లో విభజన రాజకీయాలు చేయడం  తప్పు కాదంటున్నాడీ మొగల్తూరు మొనగాడు.
     ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు భాద్యతలు భుజాన వేసుకుంటానని, టెన్ జనపథ్ అందించిన సూట్ కేస్ లతో చెన్నై పెద్ద కుమార్తె ఇంట్లో ల్యాండ్ అయ్యారట మన అన్నయ్య. చిరు ప్రచారమూ లేకపోవడంతో విచారం చెందిన కాంగ్రెస్ శ్రేణులు సోనియాకు విన్నవించారట. అంతటా ఆ కరుణామూర్తి కల్లెర్రగించిందట. ఆమె  మౌఖిక ఆదేశాలతో  చెన్నై లో కొలువుదీరిన సూట్ కేస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా లెక్కేశారు. అన్న గారి బాక్సులు బద్దలయ్యేసరికి శరణు మాతా అని వేడుకున్నారట.
    కట్ చేస్తే మళ్ళీ చిరు అన్నయ్య పెద్ద పెద్ద డైలాగులతో  ఎవరు ఎంత అన్యాయం చేసిన స్పందించని సీమాంధ్రుల  చెంతకు వస్తున్నారు. అయితే ఈ బస్సు టూర్ "చిరు" ;ప్యాకేజీలో భాగమేనని కాంగ్రెస్ ముదుర్లు మీడియాకు లీకులిస్తున్నారు. పాపం పుణ్యం అన్నయ్యకే తెలియాలి. ఎన్నో పార్టీలను తన కబంధ "హస్తాలతో" కబళించిన కాంగ్రెస్ కు  చిరంజీవి గురించి తెలియకపోవడం విషాదమే. చిరు ఒక మహా నటుడు అని, సినిమా హిట్  ఫ్లాఫ్ లతో అతనికి సంబంధం  ఉండదని, కావాల్శింది  రెమ్యునరేషన్.. ఇచ్చేది కాల్ షీట్లు .. షూటింగ్ ముగిసిన వెంటనే మేకప్ తీసేస్తాడని కాంగ్రెస్ వాళ్లకు అర్ధయ్యేదెప్పుడో అని గొనుక్కుంటున్నారు సామాన్యులు. 

Friday, March 14, 2014

జైరాం పాదాల చెంత మోకరిల్లిన సీమాంధ్ర ?

జైరాం పాదాల చెంత మోకరిల్లిన సీమాంధ్ర ?
 సీమాంధ్రులు చచ్చిపోయారా? పౌరుషాల సీమకు పక్షవాతం వచ్చిందా? ఉద్యమాల పురిటిగడ్డ ఉత్తరాంధ్ర ఊపిరి ఆగిపోయిందా? కోస్తా కోపం ప్రలోభాల కెరటాల్లో కొట్టుకుపోయిందా? ఇవన్నీ ప్రశ్నలు కాదు. జైరాం రమేష్ అనే ఒక రాజకీయ వ్యభిచారి తన మాటలతో నిరూపిస్తున్న వాస్తవాలు. నలభీముల్లాంటి కేంద్ర మంత్రులను, కాకలు తీరిన కాంగ్రెస్స్ యోధులను నపుంసకులుగా మార్చి సీమాంధ్ర వీధుల్లో చప్పట్లు కొట్టిస్తూ ఓట్లు అడుక్కుంటున్నాడీ శిఖండి. సీమాంధ్రకు మెరుగైన ప్యాకేజీ అంటూ తమ కుటుంబానికి, బంధువులకు ప్యాకేజీలు తీసుకుని జైరామ్ వెంట నడుస్తున్న నపుంసకులారా ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి?
    జైరావణ రమేష్ వికృత వ్యాఖ్యలివి ..
  1.    అధికారం మదమెక్కి.. కన్ను మిన్నూ కానకుండా వాచాలత ప్రదర్శిస్తూ సీమాంధ్రను  నిర్భయలా అత్యాచారం చేసి వదిలేసింది తానే  అంటున్నాడు. ఒక్కడికైనా కోపం రావడం లేదా? నిర్భయను  నిలువెల్లా దహించేసి మైనర్ కారణంతో తప్పించుకున్న వాడి కంటే ప్రమాదకరం జై రావణ రమేష్ సీమాంధ్ర ప్రాంతాల్లో నిస్సిగ్గుగా, నిర్లజ్జగా తన గిరజాలు జుట్టు ఎగరేసుకు తిరుగుతున్నాడు. రాజమహేంద్రి వంటి చారిత్రక నగరంపై ఈ రావణుడు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతుంటే.. చప్పట్లు కొడతావా కేంద్ర మంత్రీ .. నువ్వు నీ తండ్రికి పుట్టావా? అనే అనుమానం రావడం లేదా నీకు.

 2. హైదరాబాద్ ను సీమాన్ధ్రకు కాకుండా చేసింది నేనే అని గర్వంగా ప్రకటించిన జుట్టుపోలిగాడి మాటలు పత్రికల్లో చదవలేదా..  సీమాంధ్ర కాంగ్రెస్ నేతలూ? సీమాంధ్ర పేరుతో మీరు తీసుకున్న  పర్సనల్ ప్యాకేజీలు,  మీ నోరు పెగలకుండా చేస్తున్నాయా? పదవులు, ప్యాకేజీలు ఇస్తే అమ్మనైనా అమ్మేస్తామని నిరూపించుకున్నారు. ఆలినైనా అద్దెకిచ్చెస్తామని ప్రకటించేస్తున్నారు. బ్రోకర్ వెధవల్లారా వర్ధిల్లండి... మరోసారి అధికారం మీ చేతికి చిక్కితే సీమాంద్ర ను కుక్కలు చింపిన విస్తరిలా మూడు ముక్కలుగా విడగొట్టి పుణ్యం కట్టుకోండి.
3.  తెలుగు వారి ఆత్మగౌరవ నినాదంతో డిల్లీని వణికించిన ఎన్టీయార్ గురించి ఇంగ్లీష్ లో కారు కూతలు కూస్తున్న కర్ణాటక కంగాలీ గాడిని ఒక్క టీడీపీ కార్యకర్తా అడ్డుకోడు.ఎన్టీయార్ కు రాజ్యసభ సీటు ఇచ్చి ఉంటే  తెలుగుదేశం అనే పార్టీ పెట్టెవాడు కాదట. ఒక్కడికైనా రక్తం ఉడికి పోవట్లేదూ?  రాజ్యసభ సీటిస్తే ఎన్టీఆర్ పార్టీ పెట్టకపోతే .. నీలాంటి రాజ్యసభ దళారీగాళ్ళు తెలుగు ప్రజలను టెన్ జనపథ్ ఇంట్లో కావలి కుక్కల్లా మార్చేసేవారు.

4.  చిన్నమ్మ అని ముద్దుగా పిలుచుకునే పురందేశ్వరికి అందరిలాగే ఇచ్చిన పర్సనల్ ప్యాకేజి నచ్చక వెళ్లి పోయిందని టముకు వేస్తున్నాడీ జైరాం అనే శకుని. ఆమేమో            తేలుకుట్టిన  దొంగలా ఏవేవో మాట్లాడుతోంది. కానీ జైరామ్ మాటలను గట్టిగా ఖండించ లేకపోతోంది.  సీమాంధ్రకు న్యాయం పేరుతో జీవోఎం  సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మేల్యేలను టోకుగా బేరమాడి పెట్టుకుందని జైరాం నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నాడు. బేరం కుదరని వారు వేరే పార్టీ చూసుకుంటే.. కుదిరిన వాళ్ళు పోరాడి ప్యాకేజీ సాధించామని చెప్పుకు తిరుగుతున్నారు.
5. సీమాంధ్ర ఎంపీలను పార్లమెంట్ సాక్షిగా తమిళనాడు, బీహార్ ఎంపీలతో చితక్కొట్టించి, బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుని, ప్రసారాలను ఆపేసి భారత ప్రజాస్వామ్య వ్యవస్థను వివస్త్రను చేసి ఆమోదించుకున్న బిల్లు రాజ్యాంగబధ్ధమైనదని జైరాం ప్రసంగిస్తుంటే, సీమాంధ్రకు చెందిన సిగ్గులేని విలేకరుల ముందు నువ్వు మాట్లాడుతుంటే ఒక్కడూ ప్రశ్నించడు .. నువ్వు ఇచ్చే టీ బిస్కెట్ గొంతుకు అడ్డు పడుతుందేమో?
6. 90 రోజుల పాటు పిల్లల చదువులను సంక నాకించిన జేయేసీ నేతలూ..  సీమాంధ్ర వీదుల్లో  బురద పంది వలే స్వైరవిహారం చేస్తున్న జైరావనుడుని ఎందుకు అడ్డుకోరు.  సీమాంధ్రను శ్మశానంగా మారుస్తానని శపథం చేస్తుంటే ..చూస్తూ ఎక్కడున్నారయ్య మన ఎన్జీవోలు.
7. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ పోలవరం ఎత్తు తగ్గిస్తానని, డిజైన్ మార్పిస్తానని ప్రగల్భాలు పలుకుతుంటే ఎన్నికల అధికారులకు వినిపించడం లేదా?
8. కాకినాడను రాజధానిని చేయాలంటూ జైరాం రమేష్ పాదాలపై పడిన పంతం నానాజీని పొగడలేకుండా ఉండలేకపోతున్నాను. అచ్చం సీమాంధ్ర నేతలా వ్యవహరించిన నీ తెగువను ప్రశంసించకుండా ఉండలేక పోతున్నాను. తెలంగాణలో  జైరాం రమేష్ చేస్తున్న వ్యాఖ్యలకు తన్నడం ఒకటే తక్కువ జరగాల్సిన మర్యాదలన్నీ జరిగిపోతున్నాయి. మరి నువ్వో నీ రాజధాని లాక్కుపోయిన వాడికి పాదాభివందనం చేశావ్. కొత్త రాజధాని కోసం కాళ్ళ మీద పడ్డావు. పులసల పులుసు, పెద్దాపురం పాపల్ని పంపడం మరిచిపోకు. నీ కోరిక నెరవేరుతుంది.  నీకూ , జైరాంకు కాకినాడ అంతగా ఇష్టం లేకపోతె పెద్దాపురం, చిలకలూరిపేట, తడికలపూడి, చిలకపాలెం వంటివి కూడా అనువుగానే ఉంటాయి పరిశీంచు అన్న నానాజీ. 
 వ్యభిచారుల కొంప ముందు బ్రోకర్ గిరీ చేస్తున్న కన్నడ కన్త్రీగాడు జైరాంను నడి రోడ్డులో ఉతికి ఆరేయాల్సిన సమయమిది. ఏ ప్రాంతంలో ఆ మాట ఆడుతూ ఓట్లు సీట్లు కోసం ఫీట్లు చేస్తున్న మాంత్రికుడిని నిలదీయాల్సిన తరుణం ఇది. ఉద్యమకారులారా..ఉద్యోగులారా విద్యార్దులారా.. సమైక్యంగా ఉండామంటూ విడిపోయి ఉద్యమం చేశిన రాజకీయ రాబందులారా .. జైరామ్ రమేష్ ని ఒక్క మాట అడగండి. సీమాంధ్ర నీకేమీ అన్యాయం చేసిందని.. 
                              
                                                                         మన సత్యం, శ్రీకాకుళం

Monday, February 24, 2014

adavilo andhra


  seemandraku ..andaru chesina anyaayaniki akshara roopam.. advavilo andhra.. link click cheyyandi


http://tolivelugu.com/analysis-on-samaikyandhra-and-telangana-id3/viewnews/1/5273.html

Monday, February 10, 2014

adavilo andhra

 adavilo andhra

http://tolivelugu.com/analysis-on-samaikyandhra-and-telangana-id3/viewnews/1/5273.html