Saturday, September 20, 2014

వీడు ఎందుకు "ఆగడు" అంటే ...

 ఎవరేమనుకున్నా "ఏపీ" అంటే నాకు ఏదో షార్ట్ ఫార్మ్ గుర్తొస్తుంటుంది. ఆన్ లైన్ సినిమా అందుబాటులోకొచ్చిన ఈ రోజుల్లో.. పాత సినిమాను పేరు మార్చి రిలీజ్ చేసినా కొనేందుకు క్యూలో నిల్చుని పర్సు పోగొట్టుకుని.. సినిమా టికెట్ దొరికిందన్న హ్యాపీగా గడిపేసే మనుషులు ఉన్నన్ని రోజులూ "ఆగడు"లాంటి సినిమాలు ఆగకుండా వస్తూనే ఉంటాయి. బ్రహ్మానందం కోసం ఈలలు చప్పట్లు కొట్టే ప్రేక్షకులు, బ్రాహ్మి ట్రాక్ తో విజయం సొంతం చేసుకునే దర్శకులున్నంత కాలం తెలుగు సినిమా ఏమైపోద్దో అని పెద్దలెవరూ బెంగ పడక్కర్లేదు. పిల్లలు ఆందోళన చెందాల్సిన పనిలేదు. హెయిర్ వీవింగ్ జుట్టుకు నిగ నిగలు ఎక్కువట.. హీరో పెట్టుకున్నది విగ్గు అన్న కనీసం జ్ఞానం లేని సినీ పిచ్చోళ్ళు మా అభిమాన నాయకుడిలా హెయిర్ స్టైల్ కావాలని సిగ్గు లేకుండా సెలూన్ వాళ్ళను అడిగే వాళ్ళు ఉన్నంతకాలం వజ్రోత్సవాలేం ఖర్మ ఉక్కోత్సవాలు కూడా జరుపుకోవచ్చు. ఆగడు, సినిమా కటౌట్ తొలగించారని..కాలువలో దూకాడని మీడియాలో చూశాను. కారణం కటౌట్ అయ్యి ఉండదు. వీరాభిమాని కదా, అత్యుత్సాహంతో ప్రివ్యూ చూసి.. ఫస్టాఫ్ గబ్బర్ సింగ్, సెకండాఫ్ దూకుడు, మద్యలో పోకిరి మిక్సింగ్ చూసి తట్టుకోలేక దూకి ఉంటాడు. ఆ అభిమానే కనుక చనిపోయి ఉంటే బాధ్యులలో ఒకడు తమన్. కర్ణ కఠోర సంగీతం పాటల్ని మృత్యువులా మింగేసింది. వినేందుకు కష్టం.. నిర్మాతకు నష్టం.. దర్శకులకు ఇష్టం ఇదీ తమన్ బాణీ. తమన్ ని సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకున్నప్పుడే పాటల రచయితలు హత్యకు గురైనట్టే. రెమ్యూనరేషన్ మత్తులో ఉన్న లిరిక్ రైటర్లు తమ జీవితాలు పణంగా పెట్టి తమన్ తో పని చేస్తున్నారు. తెలుగు సినిమా నిర్మాతలు వాళ్ళు తీసిన సినిమానే మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు పెట్టిన డబ్బు కస్టపడి సంపాదించినది అయ్యి ఉండక పోవచ్చు. లేకపోతే ఇదేమి వైపరీత్యం. శ్రీను వైట్లని మాత్రం అభినందించాలి.... తనకు నచ్చని వ్యక్తులను, క్యారెక్టర్లు చేసిబాక్సాఫీస్ బాద్షా అవుతున్నాడు. ఈయన కెమెరా సూటి మనిషి.. వైట్ల గారు ఎంత కరెక్టుగా ఉంటారో నాకు తెలియదు కానీ, సినిమా బాబుల విపరీత చేష్టల్ని..స్క్రీన్ పై చూపిస్తున్నారు. విఠలాచార్య సినిమాలో నటించేటప్పుడు హీరోలు ఏ మాత్రం తోక జాడించినా శీను మారిపోయేదట. కథానాయకుడిని చంపేసి కుక్కనో, నక్కనో, కోతినో, పామునో, ఎనుగునో సృష్టించే వాడట. వైట్ల కూడా తనకు నిజ జీవితంలో, సినీ ఇండస్ట్రీలో ఎదురైన మనుషుల్ని, వారి విపరీత చేష్టల్ని కామెడీ ట్రాక్ చేస్తున్నాడు. ఇది ఇప్పుడు హిట్ ఫార్ములా అయ్యింది. సక్సెస్ ని స్వార్ధానికి ఉపయోగించుకుని తన మాట వినని వాళ్ళను, నచ్చని వాళ్ళను విఠలాచార్య లా సాధిస్తున్నాడని ఓ టాక్ ఉంది. ఏదేమైనా "ఏపీ" ప్రజలారా .. మూడు పాత సినిమాలను ఒకే టికెట్ పై చూసినందుకు మీకు అభినందనలు.. తాము తీసిన సినిమాని అదే హీరోతో మల్లె తీసినందుకు నిర్మాతలకు ధన్యవాదాలు. గబ్బర్ సింగ్ అంత్యాక్షరిని ఎవరు మీలో పోటుగాడుగా మార్చినా, దూకుడు పద్మశ్రీ ఎపిసోడ్ ని డిల్లీ సూరి పాత్రతో డ్రామా ఆడించినా క్రెడిట్ అంతా శ్రీను వైట్లదే. అయితే దూకుడు ఆయన సినిమా కృతజ్ఞతలు చెప్పుకోవక్కర్లే. మరి గబ్బర్ సింగ్, పోకిరి డైరెక్టర్ల కైనా ధన్యవాదాలు చెప్పాలి కదా? చివరాఖరికి ఏపీ, టీఎస్ ప్రజలంతా కలిసి ఆ మూడు సినిమాలకు కలిపి వచ్చిన కలెక్షన్లు "ఆగడు"కు కురిపిస్తే.. మళ్ళీ 200 కోట్లతో దూకుడు ,గబ్బర్ సింగ్, పోకిరి, "ఆగడు"లతో కలిపి మరో సినిమా శ్రీను వైట్ల తీస్తాడని నేను ప్రేక్షకులకు హామీ ఇస్తున్నాను.. 

1 comment:

  1. పోనీలెద్దూ... ఒకప్పుడు మనవాళ్ళు ఇంగ్లీషు సినిమాలను చూసి 'ఇనిస్పైర్' అయ్యేవారు -అనగా కాపీకొట్టేవారు. ఇప్పుడు రెండుమూడేళ్ళ క్రితంవచ్చిన తెలుగు సినిమాలను చూసి 'ఇనిస్పైర్' అవుతున్నారు. ఆమేరకు తెలుగు సినిమాలు ఇతర (తెలుగు) సినిమాలకు 'ఇనిస్పిరేషను'గా నిలువగలిగే స్థాయికి ఎదిగినందుకు తెలుగు సినిమా మహరాజపోషకులుగా మనం ఎంతో గర్వించాలి.

    కొందరు ప్రస్తుత తెలుగుసినిమా, రెండేళ్ళ క్రిందటి తెలుగు సినిమాను కాపీకొట్టే స్థాయికి పడిపోయింది అంటారు. వారిని పట్టించుకోకండి. వాళ్లంతా మేధావులు. వాళ్ళు అలాగే మాట్లడతారు.

    ReplyDelete