Friday, March 28, 2014

బస్సుయాత్రకు "చిరు" ప్యాకేజీ?

బస్సుయాత్రకు "చిరు" ప్యాకేజీ?
తన సొంత బేనర్ అయిన అంజనా ప్రొడక్షన్ సినిమాలో నటించినా రెమ్యునరేషన్ ముక్కు పిండి మరీ ఏరియా హక్కుల రూపంలోనైనా చిరంజీవి తీసుకుంటారని సినీవర్గాలలో ప్రచారంలో ఉంది.  సినిమా పోయి సొంత తమ్ముడు అప్పుల పాలైపోయినా తీసుకున్న సొమ్ము తిరిగి ఇచ్చిన సందర్భాలూ లేవట.  ఆరెంజ్ సినిమాయే దీనికి చక్కని ఉదాహరణ అని సినీ విమర్శకులు చెబుతున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. 13 జిల్లాల సీమాంధ్రను కక్ష కట్టి అన్యాయం చేసిన కాంగ్రెస్ ను తాను రక్షిస్తానంటూ బస్సులో బయలు దేరారీ మెగాస్టార్.
    ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఏరియాల వారీగా టికెట్లు అమ్ముకుని ఎన్నో కుటుంబాలను, మరెందరో అభిమానులను నిలువెల్లా ముంచి కాంగ్రెస్ అనే నదిలో విలీనమైపోయాడీ ముఠామేస్త్రీ. రెండు మంత్రి పదవులు, ఒక కేంద్రమంత్రి పదవి, రాజ్యసభ సీటుకు ప్రజా రాజ్యం ఆడియో, వీడియో, శాటిలైట్ హక్కులను అమ్మేసిన మొనగాడు. కిరణ్ కుర్చీ దిగితే ఎక్కేద్దా మనుకుని కాపలా కాసి కుదరకపోవడంతో కాంగ్రెస్ రక్షకుడి అవతారం ఎత్తాడు. రాష్ట్ర విభజన తప్పే కాదని, సీమాన్ధ్రకు అన్యాయం చేయడం కూడా తన సామాజిక న్యాయ సూత్రాలకు విరుద్ధం ఏమీ కాదంటున్నాడు. కొనే వాడు ఉన్నప్పుడు టికెట్ అమ్మటం ఎంత కరెక్టో, కాంగ్రెస్ అడ్రస్ గల్లంతు అవుతున్న పరిస్థితుల్లో విభజన రాజకీయాలు చేయడం  తప్పు కాదంటున్నాడీ మొగల్తూరు మొనగాడు.
     ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్ధుల గెలుపు భాద్యతలు భుజాన వేసుకుంటానని, టెన్ జనపథ్ అందించిన సూట్ కేస్ లతో చెన్నై పెద్ద కుమార్తె ఇంట్లో ల్యాండ్ అయ్యారట మన అన్నయ్య. చిరు ప్రచారమూ లేకపోవడంతో విచారం చెందిన కాంగ్రెస్ శ్రేణులు సోనియాకు విన్నవించారట. అంతటా ఆ కరుణామూర్తి కల్లెర్రగించిందట. ఆమె  మౌఖిక ఆదేశాలతో  చెన్నై లో కొలువుదీరిన సూట్ కేస్ ఒక్కటి కూడా మిస్ కాకుండా లెక్కేశారు. అన్న గారి బాక్సులు బద్దలయ్యేసరికి శరణు మాతా అని వేడుకున్నారట.
    కట్ చేస్తే మళ్ళీ చిరు అన్నయ్య పెద్ద పెద్ద డైలాగులతో  ఎవరు ఎంత అన్యాయం చేసిన స్పందించని సీమాంధ్రుల  చెంతకు వస్తున్నారు. అయితే ఈ బస్సు టూర్ "చిరు" ;ప్యాకేజీలో భాగమేనని కాంగ్రెస్ ముదుర్లు మీడియాకు లీకులిస్తున్నారు. పాపం పుణ్యం అన్నయ్యకే తెలియాలి. ఎన్నో పార్టీలను తన కబంధ "హస్తాలతో" కబళించిన కాంగ్రెస్ కు  చిరంజీవి గురించి తెలియకపోవడం విషాదమే. చిరు ఒక మహా నటుడు అని, సినిమా హిట్  ఫ్లాఫ్ లతో అతనికి సంబంధం  ఉండదని, కావాల్శింది  రెమ్యునరేషన్.. ఇచ్చేది కాల్ షీట్లు .. షూటింగ్ ముగిసిన వెంటనే మేకప్ తీసేస్తాడని కాంగ్రెస్ వాళ్లకు అర్ధయ్యేదెప్పుడో అని గొనుక్కుంటున్నారు సామాన్యులు. 

No comments:

Post a Comment