Sunday, July 4, 2010

నాకు దేవుడు కనిపించాడు

కొండకు ఎల్తున్నాను
బస్సులో కనిపించాడు
కండక్టర్ దేవుడు
నన్ను చూసి విసుక్కుంటూ

రైలెక్కాను
జెనరల్ టిక్కెట్టుతో రిజర్వేషన్లో ...
ఎదురయ్యాడు టిటి భగవంతుడు
సమర్పించుకున్నాను దక్షిణ

కొండ కాడ
గుండు కాడ
లడ్డు ఉండ కాడ
కనిపించారు సాములోరు

ఏడేడు కొండల దారిలో
గర్భ గుడిలో
కనిపించిన పెతి జీవుడు
నాకు దేవుడి లెక్కే కనిపిస్తున్నాడు

ఇంత మంది దేవుళ్ళను చూసిన నేనే వీఇపి ..
నేను డబ్బిచ్చిన ప్రతి చోటా హుండీ కేననుకున్న
నాకు దేవుడు కనిపించాడు బ్రేక్ దర్సనములో ....

4 comments:

  1. నాకు చమన్ దేముడు కన్పించాడు/జయదేవ్,చెన్నై-౧౭

    ReplyDelete
  2. నేనూ జీవుడినే జయదేవ్ సార్

    థాంక్యూ సార్...

    ReplyDelete
  3. నిజంగానే మీ కవిత నచ్చి అలా వ్యఖాయాని౦చాను చమన్ జీ..జయదేవ్.

    ReplyDelete