Monday, July 12, 2010

పారిపోదాం...

మార్నింగ్ వాక్ లు
రౌండ్ ది క్లాక్
ఉరుకు పరుగులు
నిద్రలోనూ పయనమే ..

పదండి ముందుకు
పదండి తోసుకు
తొక్కుకుంటూ .. ఎక్కుకుంటూ
ఆగకుండా నడిచే వాడే మొనగాడు

తెలియని గమ్యం
అలుపెరుగని పయనం
పడిపోతే పోయేదేం లేదు
లేచి నిలబడడం తప్పా ..

పారిపోదాం ..
నింగిలోకి ..
నీళ్ళలోకి ..
గాలిలోకి
srichaman ...

2 comments:

  1. కవితలో మీరుకాక మరొకరు గోచరిస్తే అది సృజనకాదు కేవలం అనుకరణ మాత్రమే.ప్రారంభంలో అది తప్పు కాదు కానీ ,పరిణితి లో పెద్ద తప్పే అవుతుంది.--జయదేవ్.చల్లా,చెన్నై-౧౭.

    ReplyDelete
  2. జయదేవ్ గారూ .. నా అక్షరాల గమనాన్ని చాలా బాగా విశ్లేషించారు. ఐతే మీరు సూచించిన లోపాలు సరిదిద్దుకోలేక పోతున్నాను. నా చదువు , రాయడం తక్కువ. ఈ కారణంగా వచనాలలో అనుకరణ వస్తోంది అనుకుంటున్నాను . ఎక్కువగా పేద మద్య తరగతి గురించి రాయడం పేరు కోసం కాదు. నేను నా చుట్టూ వున్నవాళ్ళు పడుతున్న ఇబ్బందులు అధిగమించలేక, దానికి కారకులవుతున్నవారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలోనే ఈ అపరిపక్వ రాతలు.

    ReplyDelete