Saturday, February 11, 2017

శ్రీచ‌మ‌న్ క‌విత్వంపై య‌శ‌స్వి స‌తీష్ రాసిన మాట‌లు..


కవితత్వాలు: 260
భావం భాషను వెతకడం నేరం, అక్షరాలకు ఆలోచన లేకపోవడం పాపం
అందుకే భాషమారినా.. పూలతోట మనసు మధుసూదన్ కే చెల్లింది
వ్య‌వ‌స్థ‌ను భుజాన వేసుకుని తిరుగుతున్న ఈ భేతాళ మాంత్రికుడు
తూరుపు..నుంచి ఉదయించాడు జ్ఞానోదయమై
ఉదయం ప్రసవ వేదన సాయంత్రం ప్రసూతి వైరాగ్యం
రాతిరి పీడకలలు వేకువన కొత్త ఆశలు
రోజులన్నీ సూర్య చంద్రులవేనా? గ్రహణం రోజైనా నాకోసం విడవండి ..అంటాడు శ్రీచమన్
వార్తలమధ్య లోకాన్ని తూస్తున్నాడు కదా! వ్యంగ్యం మత్తుగా పేలుస్తాడు..
సెల్లో బిడ్దల్నీ లాలిస్తాడు, స్టార్ హొటల్ లో ప్రజాకవిని సన్మానిస్తాడు
కనిపించిన వారినల్లా కలకంటూ స్వప్న స్ఖలనాలపై నిదిరిస్తున్న స్ఖలిత బ్రహ్మచారి పై ఫోకస్
హారన్ మోగించే క్రూర జంతువులను తప్పించుకుంటూ..
కంకర అడవుల ముళ్ళ బాటలో పాదరక్షలు లేకుండా బడికెళ్ళే చిట్టి తల్లి కి మేక్ ఎ విష్
డిస్కౌంట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ఆషాడం ఆఫర్ బ్రేక్ లో యాడ్ చేస్తాడు
విజయానికి చాలా మెట్లు.. ఎక్కడం దండగ ఎస్కలేటర్ కోసమే నిరీక్షణ అనుకునే వాళ్ళని చూపే
ఇతని కవిత్వం బ్లర్ చెయ్యని ఓ నేకెడ్ విజువల్..
కన్నీళ్ళు పెట్టించే కామెడీ ట్రాక్! ఉల్లీ!.. లావైపోతావ్.. చమన్ ని చూసి దిగొచ్చేయ్..మరి
మతల్లీ అంటే అర్థం తెలియని కళామతల్లుల దేశంలో నిజాన్ని తెరకెక్కించే నైజం
ఆక్వేరియంలో చేప పిల్లల్లా.. ఇంటి గేటుకు కట్టేసిన కుక్కలా
కుంచించుకుపోయిన ప్రపంచం జీవితంలాగే నిస్సారం
బతికేయండ్రా.. ఏదో.. ఇలాగ.. అంటాడు
చావుకు ఎదురెల్లే కూలి జనం, రైతు ఎక్సెప్షన్స్
రోజూ చచ్చేవాడిని.. పరామర్శిస్తున్నాడిక్కడ..
కవికి కవికి గుండెలు మండే బాధ ఇది
(రెండు మాటలు శీర్షికతో సోషల్ మీడియాలో ముఖ్యంగా కవిసంగమం వేదికపై వస్తున్న కవితలు, వాటిని రాస్తున్న కవులను చదివి యశస్వి సతీష్ రాసిన మాటల్లో ఈ రెండుమాటలు నావి) వందకవితలు రాసినవాడికి, అందులో ఒకటైనా చదివామని ఒకరు చెబితే ఎంత ఆనందం. అలాగే కొన్ని వందల మంది రాసిన కవితలన్నీ విశ్లేషించి, రెండు మాటలు వారి గురించి రాయడమంటే ఆ కలానికి ఎంత బలం వుండాలి. ఆ మనిషికి ఎంత పెద్దమనసుండాలి. ఆయనే యశస్వి సతీష్ గారు. పరిచయం లేకుండానే కవి అన్నప్రేమతో నా కవిత్వం గురించి రాసిన రెండుమాటలు యిక్కడ షేర్ చేస్తున్నా..


1 comment:

  1. good evening
    its a nice information blog...
    The one and only news website portal INS media.
    please visit our website for more news update..
    https://www.ins.media/

    ReplyDelete