Thursday, February 9, 2017

కాలిన గాయాల‌కు..పోయిన ప్రాణాల‌కు...

....................................................................... దిగ్విజ‌యం అయుత చండీయాగం క‌ల్వ‌కుంట్ల వారి `కోట‌`రీకి యోగం నిరుప‌యోగ‌మ‌న్న వార‌య్యారు ఆగం రైతుల ఆత్మ‌ల‌కు శాంతి చేకూర్చిన యాగం ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఎంతో ఉప‌యోగం ఆక‌లి మంట‌ల‌కు ఆత్మాభిమాన పోరాటానికీ మ‌రో సెంటిమెంట్ ఆయింట్‌మెంట్ ఎక్స్‌ట‌ర్న‌ల్ తెలంగాణ‌..ఇంట‌ర్న‌ల్ హిందుత్వ‌ కాలిన గాయాల‌కు..గొంతుచించుకున్న గేయాల‌కు రాలిన ప్రాణాల‌కు ..కొన ఊపిరితోనున్న జ‌నాల‌కు పున‌రుజ్జీవ‌న చంద్ర‌శేఖ‌ర మంత్రం అయుత చండీయాగం నాడు ప‌ద్ద‌తి తెలియ‌ని ఆంధ్రా అయ్యోర్లు నేడు కాషాయ ముసుగులో ముక్తినిచ్చే దేవుళ్లు రాజ‌మండ్రి జీయ‌ర్‌కు జీహుజూర్‌ విశాఖ స్వ‌రూపానందానికి వంద‌నం కాకినాడ ప‌రిపూర్ణానంద‌పై ప‌రిపూర్ణ విశ్వాసం ట్యాపింగ్ ఆయుధం ఎక్కుబెట్టిన‌ బాబును ట్రాప్ చేసిన శుభయోగం కొమ్ములు తిరిగిన గ‌వ‌ర్న‌ర్లతో పంచెలెగ్గ‌ట్టి ప‌డి ప‌డి దండాలు పెట్టించిన మంత్ర‌దండం అయుతం అద్వితీయం యాగ‌ఫ‌లం అమోఘం ప్ర‌తిప‌క్షంలేని న‌వ తెలంగాణ‌ ప్ర‌శ్నించ‌లేని బంగారు తెలంగాణ కోసం మ‌లి విడ‌త ప్ర‌యుత ప్ర‌య‌త్నం .............................శ్రీచ‌మ‌న్‌...................................28.12.15

No comments:

Post a Comment