https://chaduvu.wordpress.com/2008/02/01/turupu/
Thursday, March 2, 2017
Saturday, February 11, 2017
శ్రీచమన్ కవిత్వంపై యశస్వి సతీష్ రాసిన మాటలు..
కవితత్వాలు: 260
భావం భాషను వెతకడం నేరం, అక్షరాలకు ఆలోచన లేకపోవడం పాపం
అందుకే భాషమారినా.. పూలతోట మనసు మధుసూదన్ కే చెల్లింది
వ్యవస్థను భుజాన వేసుకుని తిరుగుతున్న ఈ భేతాళ మాంత్రికుడు
తూరుపు..నుంచి ఉదయించాడు జ్ఞానోదయమై
ఉదయం ప్రసవ వేదన సాయంత్రం ప్రసూతి వైరాగ్యం
రాతిరి పీడకలలు వేకువన కొత్త ఆశలు
రోజులన్నీ సూర్య చంద్రులవేనా? గ్రహణం రోజైనా నాకోసం విడవండి ..అంటాడు శ్రీచమన్
వార్తలమధ్య లోకాన్ని తూస్తున్నాడు కదా! వ్యంగ్యం మత్తుగా పేలుస్తాడు..
సెల్లో బిడ్దల్నీ లాలిస్తాడు, స్టార్ హొటల్ లో ప్రజాకవిని సన్మానిస్తాడు
కనిపించిన వారినల్లా కలకంటూ స్వప్న స్ఖలనాలపై నిదిరిస్తున్న స్ఖలిత బ్రహ్మచారి పై ఫోకస్
హారన్ మోగించే క్రూర జంతువులను తప్పించుకుంటూ..
కంకర అడవుల ముళ్ళ బాటలో పాదరక్షలు లేకుండా బడికెళ్ళే చిట్టి తల్లి కి మేక్ ఎ విష్
డిస్కౌంట్లో టెస్ట్ ట్యూబ్ బేబీ ఆషాడం ఆఫర్ బ్రేక్ లో యాడ్ చేస్తాడు
విజయానికి చాలా మెట్లు.. ఎక్కడం దండగ ఎస్కలేటర్ కోసమే నిరీక్షణ అనుకునే వాళ్ళని చూపే
ఇతని కవిత్వం బ్లర్ చెయ్యని ఓ నేకెడ్ విజువల్..
కన్నీళ్ళు పెట్టించే కామెడీ ట్రాక్! ఉల్లీ!.. లావైపోతావ్.. చమన్ ని చూసి దిగొచ్చేయ్..మరి
మతల్లీ అంటే అర్థం తెలియని కళామతల్లుల దేశంలో నిజాన్ని తెరకెక్కించే నైజం
ఆక్వేరియంలో చేప పిల్లల్లా.. ఇంటి గేటుకు కట్టేసిన కుక్కలా
కుంచించుకుపోయిన ప్రపంచం జీవితంలాగే నిస్సారం
బతికేయండ్రా.. ఏదో.. ఇలాగ.. అంటాడు
చావుకు ఎదురెల్లే కూలి జనం, రైతు ఎక్సెప్షన్స్
రోజూ చచ్చేవాడిని.. పరామర్శిస్తున్నాడిక్కడ..
కవికి కవికి గుండెలు మండే బాధ ఇది
(రెండు మాటలు శీర్షికతో సోషల్ మీడియాలో ముఖ్యంగా కవిసంగమం వేదికపై వస్తున్న కవితలు, వాటిని రాస్తున్న కవులను చదివి యశస్వి సతీష్ రాసిన మాటల్లో ఈ రెండుమాటలు నావి) వందకవితలు రాసినవాడికి, అందులో ఒకటైనా చదివామని ఒకరు చెబితే ఎంత ఆనందం. అలాగే కొన్ని వందల మంది రాసిన కవితలన్నీ విశ్లేషించి, రెండు మాటలు వారి గురించి రాయడమంటే ఆ కలానికి ఎంత బలం వుండాలి. ఆ మనిషికి ఎంత పెద్దమనసుండాలి. ఆయనే యశస్వి సతీష్ గారు. పరిచయం లేకుండానే కవి అన్నప్రేమతో నా కవిత్వం గురించి రాసిన రెండుమాటలు యిక్కడ షేర్ చేస్తున్నా..
కాలాలీత కవితలు
నా మరణానికి ఎవరూ కారణం కాదు ..
నిండు చూలాల్లు
నిండుగా ఉన్న
ధర్మాసుపత్రిలా ఉంది
జనరల్ బోగీ
కష్టాలను మూటగట్టి
నెత్తికెత్తుకుని సామాన్యుడిలా
దూర ప్రాంతాలకు
భారంగా కదిలిన బస్సు
విరామమెరుగని
విశాలమైన నగరదారులన్నీ
పల్లె ఇరుకు సందులకు
పరుగులు పెడుతున్నాయి
పొమ్మన్న పల్లెలో
సంకురాతిరి సంబరానికి
పిలవని పేరంటాళ్ళు
ఈ వలస పక్షులు
డబ్బుకు.. జబ్బుకు
పల్లె పట్టణమన్న తేడాల్లేవ్
అంటు కట్టిన పార్దీనియం మొక్కలు
అంటువ్యాధిలా విస్తరించాయి
ఇక్కడ క్లబ్బులు పబ్బులు
అక్కడ కోడి పందాలు
పొట్టేళ్ల పోటీలు
బెల్ట్ తీసిన షాపులు
రక్తాన్ని చెమట చేసి
కష్టాన్ని కాసులుగా మార్చి
పల్లెకొచ్చిన బాటసారి
జేబుకు చిల్లు పెట్టిన నల్ల దొరలు
తాటి తోపులో మొలిచిన
రియల్ కొలత రాళ్ళు
తొక్కుడు బిల్లాట పిల్లల కాళ్ళకు
చేసిన మానని గాయం
పళ్ళు లేని ఊక జోరులో
గుంట నక్కలు
వూరిలో మనుషుల్ని
పీక్కు తినే ఊర కుక్కలు
పంటల్లేని పల్లెలో
ఆకలి మంటల్లా
భోగి మంటలు
టైర్ కాలిన వాసన
పండగ పూట అందరూ
ఆటకెళ్ళే పెద్ద తోట
చెట్టు మోడై భూమి బీడై
చిన్నబోయింది
మద్యం మత్తులో
వావివరసలు మరిచిన
కనుమ కలహాలు
కంపరం పుట్టిస్తున్నాయి
చెరిగిపోతున్నఅద్భుత చిత్రాన్ని
తిరిగి చిత్రించేందుకు
నేను బ్రమ్మనూ కాను
ఆయన చేసిన బొమ్మను
అందుకే కూలిపోయిన
నా పూరిల్లు సాక్షిగా
బ్రాందీ సీసాలో దూరి
ఆత్మహత్య చేసుకుంటున్నాను ..
.............. శ్రీచమన్ .............. (12. 01. 2015)
సాగరుడే వీరుడు //శ‌్రీచమన్//
కలలు కూడా అలల్లానే
వచ్చి పోతుంటాయి
కళ కట్టిన ఇసుక గూళ్లు
కసిగా కుమ్మేస్తుంది కాలం
భారమైన ప్రతీ దాన్నీ
సుదూరాలకు విసిరేసి
మళ్లీ ప్రేమగా ఒడ్డుకు చేర్చి
తన ఒడిలో లాలిస్తుంది తీరం
కడలి హోరులో ఊసులు
సాగర ఘోషలో బాసలు
కల్లోల కెరటాల కింద
మాసిపోయిన పాదముద్రలు
అల చెరిపేసిన అక్షరాలు
కామోద్దీపన ప్రేరేపిత ప్రేమలు
అవాంఛిత అనురాగాలు
బికినీ.. బీచ్ బంధాలు
కోరికల్ని తీర్చుకునే అందాలు
తన తనువు చివర తీరంలో
కోట్లాది ప్రేమలు విడిచిన గుర్తులు సాక్షిగా
అదే నదీ కన్యకలతో పదేపదే రమిస్తూ
ఒక అనంతకాలపు సాగరమోహం
తరతరాల చరితను
తిరగరాస్తున్న తరంగాలు
గెలుపోటముల నాయకుడు
సాగరుడే వీరుడు
....................................................18-11-16
మళ్లీ వాడే వచ్చాడు// శ‌్రీచమన్ //
మొదట వాడు
భజనపరుడి కోసం వచ్చాడు
నేనా భజనబృందంలో లేను
తర్వాత వాడు
చాడీలు చెప్పేవాడి కోసం చూశాడు
చాడీలు చెప్పడం నాకు చేతకాదు
అనంతరం వాడు
తన ప్రాంతంవాడిని వెతికాడు
నాదా ప్రాంతం కాదు
మరోసారి వాడు
తన కులపోడిని అన్వేషించాడు
నేనా కులం వాడిని కాను
పట్టువదలని వాడు
తన మతం వాడి కోసం నిరీక్షించాడు
నాదా కుత్సిత మతం కాదు
చివరిగా వాడు
మనిషి కోసం వచ్చాడు
నేను మనిషినే అంటే నమ్మలేదు
భజన చేయలేవు..
చాడీలు చేతకావు..
ప్రాంతం, కులం, మతమూ
ఏదీ కలవనప్పుడు
నువ్వు మనిషివంటే నేనెలా
నమ్మాలని ప్రశ్నించాడు?
శ్రీచమన్.... 08.11.2016
(జర్మన్ కవి ఫాస్టర్ మిల్లర్‌కు క్షమాపణలతో)
షిఫ్ట్+ఆల్ట్ ...డిలీట్//శ్రీచమన్//
..........................................
మెమరీ కార్డ్ ఫుల్
కలల్ని చెరిపేసేయ్
ఆశల్ని చిదిమేసేయ్
లైఫ్‌కు స్పేస్ కావాలి
నచ్చిన షేప్లో డిజైన్ చేసేందుకు
జీవితం ఫోటోషాప్ కాదు కదా!
కొన్ని ఫిల్టర్‌లు, మరికొన్ని ఎఫెక్ట్‌లు
వేసి విషాదాల్ని బ్లర్ చేయలేవు
కంట్రోల్ పట్టుకుని సీ కొడితే
నీకు నచ్చినవి కాపీ కావు
కంట్రోల్ పీ ఒత్తితే
కావాల్సినదల్లా నీ లైఫ్ డెస్క్‌పై
ఉన్న ఫోల్డర్‌లో పేస్ట్ కాదు
చిత్రమైనా, దృశ్యమైనా
బొమ్మ వెనుక బొరుసు
ఎడిటింగ్‌లో క్వాలిటీ లోపిస్తే
లైఫ్‌లో క్లారిటీ మిస్సవుతుంది.
24 ఫ్రేమ్స్ డ్రీమ్స్
అద్దంలా ముక్కలై
ఒక్కో ముక్కలో ఒక్కో ముఖం
నీ ప్రతిరూపం భిన్నమైంది
సిస్టమ్ మొత్తం వైరస్
ఫార్మాట్ చేయాల్సిన
సమయం ఆసన్నమైంది
ప్రస్తుతానికి కొన్ని టెంప్ ఫైల్స్
షిఫ్ట్ ఆల్ట్ డిలీట్ కొట్టేసేయ్
డిలీట్..డిలీట్..
జీవితకాలం లేటు
పేరు ముందు లేట్
కూడా డోన్ట్ డిలీట్
శ్రీచమన్.....9490638222 (07.11.2016)
//జన్మదిన శుభాకాంక్షలు //శ‌్రీచమన్//
నది ఎండినది
కన్నీటి చారిక
అల్లకల్లోల తీరం
దుఖఃసాగరం
బీడు భూములు
పిట్టల బొమ్మలు
మనుషుల మనసులు
ముళ్లకూ ఓ కంచె
దేహానికి దాహం
పొంచివున్న ద్రోహం
కలకు మెలకువ
అంతా భ్రాంతి
నిద్రకు ఓ మాత్ర
రోజూ ఓ మరణం
ఉదయం ఓ అలారం
నిత్యమూ జననం
.....................................24.07.16
//మనిషి కావాలి//శ్రీచమన్//
నలుగురిలో నవ్వేందుకు
ఓ ముఖం కావాలి
ఒంటరిగా ఏడ్చేందుకు
కాసిన్ని కన్నీళ్లు రావాలి
బహిరంగంగా అరిచేందుకు
ఓ నినాదం రాయాలి
పిడికిలెత్తి నినదించేందుకు
నరాలకు శక్తి అవసరం
అప్పుడప్పుడూ సిగ్గుపడేందుకు
శరీరంలో చీమూనెత్తురు వుండాలి
సాయం చేయాలనిపించేందుకు
స్పందించే మనసుంటే మంచిది
మంచో చెడో మాట్లాడటానికి
ఒక మనిషి అత్యవసరం
..............................................04.07.2017
నువ్వూ వెళ్లి``పోతావ్`` //శ్రీచమన్ //
చేపల కోసం చెరువుని
చెక్కల కోసం చెట్టుని
ఇసుక కోసం నదిని
ఇంధనం కోసం సంద్రాన్ని
గోళ్లు కోసం పులుల్ని
ప్రయోజనాల కోసం ప్రకృతిని
పదవుల కోసం ప్రజల్ని
మింగేసిన తరువాత
నువ్వూ, నీ వారసులు మాత్రమే
ఉంటారని ఎలా అనుకుంటావో
.............................................30.06.16
రుణం అను బంధం//శ‌్రీచమన్// 17.06.16
అంతా మిధ్య అనుకున్న
దాంట్లో ఎంత వైవిధ్యం
గాలి, నీరు, ఆహారమే కాకుండా
కొన్ని ఆఫర్లు నిత్యావసరం
మరికొన్ని కాప్లిమెంటరీ పాస్‌లు
అత్యవసరం
చెప్పుల్లేకపోయినా, అప్పుల్లేకపోయినా
నడవడం చాలా కష్టంగా వుంది మాస్టారు
మీకు ``అప్పు``డే తెల్లారిందా? అంటాడు అశోక్
ఎనిమిదేళ్ల స్నేహంలో పంచుకున్న
టీకబుర్లలో రుణానుబంధాలదే అగ్రస్థానం
అప్పుల కోసం ఎక్కే మెట్ల
ముందు విడిచిన చెప్పులు
తప్పులు చేసినవాడెక్కిన కోర్టు మెట్లు
అడగడంలో నైపుణ్యం !
సారీ! అడుక్కోవడంలో ఒక లావణ్యత
అలవాటుగా మారిపోతుంది
జీతం ఏంచేస్తున్నాడో?
పెళ్లి చేశాడా? ఇల్లుకట్టాడా?
ఎప్పుడూ అప్పే అంటాడు
దాత మదిలో అనుమానాలు.
సందేహం తీర్చేందుకు సమయం చాలదు
గడువు గడప ముందు కుర్చీవేసుక్కూర్చుంది
వడ్డీ అసలుతో కలిసి నిలదీసేందుకొచ్చింది
అప్పిచ్చువాడు ఇచ్చు సలహాలు ఉచితం
అపరచాణక్యుడిలా అర్థశాస్ర్త ప్రదర్శన చేస్తాడు
నువ్వు అప్పు ఇస్తే అదే పదివేలు అంటే!
ఓ వెయ్యి తీసుకో తిరిగివ్వక్కర్లేదనే
మోడ్రన్ ఎకానమీని ముందుంచుతాడు
రుణానుబంధాలు
అనుబంధాలను ప్రశ్నిస్తాయి
స్నేహసంబంధాలు, బంధువులను
అప్పుల ముప్పు ముట్టడిస్తుంది
ఫోన్ రింగొస్తే వారికి బెంగ
రింగ్ టోన్ ``రుణ``గొణధ్వనిలా
ఈ కాల్ ఇంతటితో శాశ్వతంగా
కట్ అయిపోతే బాగున్ననిపించేలా
మాయమైన స్నేహితులు
దూరమైన బంధువులు
ప్రత్యక్షమైన రుణాలు
దగ్గరైన అసలువడ్డీలు
పత్రాలా సాక్ష్యాలా నిను ఒంటరికాకుండా
కాపాడుకొచ్చే రుణానుబంధం
మానవసంబంధాల స్థానంలో
వచ్చి కూర్చున్నాయి మనీసంబంధాలు
..................................................................(భయద సౌందర్యం శీర్షికతో కొప్పర్తిగారు రాసిన కవితాస్ఫూర్తితో)
శ్రీచమన్//the last picture అనబడు చివరి చిత్రం////
....................................
ముఖ కవళికలో కళ శూన్యం
కుంచె కదలికలో నైరాశ్యం
బహుభాషా కోవిదుడు
కానీ మూగవాడు
ముభావమే భావం
ఆల్ వాటర్ కలర్స్
దేహాంతర్వాహినిలో
చలనాలు..సంచలనాలు
జ్వరాలు..జ్వలనాలు
కాలాతీత సంకేతాలు
టెంపరేచర్ రీడింగ్
థర్మామీటర్ ధర్మం
హృదయం ఉష్ర్ణపక్షి
ఈ రోజు నమోదైన కనిష్ట, గరిష్ట
ఉష్ణోగ్రతలు ఈ విధంగా ఉన్నాయి
ఓజోన్ తాటాకు చప్పుళ్లకు
బెదరని నిప్పుల కుంపటి
ఆరోగ్యప్రదాత సౌజన్యంతో
రోగులకు ఓ వైద్యశిబిరం
దింపుడుకళ్లము దగ్గర
the last picture అనబడు
చివరి చిత్రం మసక ..మసకగా
ఎగిసిపడుతున్న మంటల్లో
ఓ దగ్ధ దృశ్యం
.......................................
శ్రీచమన్, 9490638222

Thursday, February 9, 2017
కాలిన గాయాలకు..పోయిన ప్రాణాలకు...
.......................................................................
దిగ్విజయం అయుత చండీయాగం
కల్వకుంట్ల వారి `కోట`రీకి యోగం
నిరుపయోగమన్న వారయ్యారు ఆగం
రైతుల ఆత్మలకు శాంతి చేకూర్చిన యాగం
ఆపరేషన్ ఆకర్ష్‌కు ఎంతో ఉపయోగం
ఆకలి మంటలకు
ఆత్మాభిమాన పోరాటానికీ
మరో సెంటిమెంట్ ఆయింట్‌మెంట్
ఎక్స్‌టర్నల్ తెలంగాణ..ఇంటర్నల్ హిందుత్వ
కాలిన గాయాలకు..గొంతుచించుకున్న గేయాలకు
రాలిన ప్రాణాలకు ..కొన ఊపిరితోనున్న జనాలకు
పునరుజ్జీవన చంద్రశేఖర మంత్రం
అయుత చండీయాగం
నాడు పద్దతి తెలియని ఆంధ్రా అయ్యోర్లు
నేడు కాషాయ ముసుగులో ముక్తినిచ్చే దేవుళ్లు
రాజమండ్రి జీయర్‌కు జీహుజూర్
విశాఖ స్వరూపానందానికి వందనం
కాకినాడ పరిపూర్ణానందపై పరిపూర్ణ విశ్వాసం
ట్యాపింగ్ ఆయుధం ఎక్కుబెట్టిన
బాబును ట్రాప్ చేసిన శుభయోగం
కొమ్ములు తిరిగిన గవర్నర్లతో
పంచెలెగ్గట్టి పడి పడి దండాలు
పెట్టించిన మంత్రదండం
అయుతం అద్వితీయం
యాగఫలం అమోఘం
ప్రతిపక్షంలేని నవ తెలంగాణ
ప్రశ్నించలేని బంగారు తెలంగాణ కోసం
మలి విడత ప్రయుత ప్రయత్నం
.............................శ్రీచమన్...................................28.12.15
Wednesday, February 8, 2017
పథం-దృక్పథం...4
పథం-దృక్పథం...4
అది ఓ మత్తు. ఓ వ్యసనం. మానని మానసిక రుగ్మత. పేరేదైనా దాని తీరొక్కటే. అందలం, అధికారం, పీఠం..ఏదైనా కానీ. కుల,మత,ప్రాంతాలకు అతీతంగా దానికి లోనుకాని దాసుడు లేడు. దాసీ లేదు. కీర్తి, కాంత, కనకం ..వీటన్నింటితో సంబంధబాంధవ్యాలు కలుపుకున్న అధికారం స్టైలే వేరు. నేతాజీకి పుత్రాజీ భయం. జామాతతో మామకు సంకటం. ఇష్టసఖితో ఇరకాటం. నెచ్చెలి అంట. ఈ చెలికత్తె..విషం పూసిన కత్తి అని తెలిసీ..మీడియా, ప్రజలు ప్రియసఖి అని సంబోధిస్తూ..కొత్త అర్థాలు తీస్తున్నారు. అధికారం కోసం తమ అనుకూలురు చేసే కుట్రలకు ప్రజాస్వామ్య పరిరక్షణ..అమ్మ మాట కోసం వంటి కొత్త పదాలు..వాటి అర్థాలు వెతికి పట్టి మరీ మీడియా..తన పాత్ర తాను పోషిస్తోంది. అధికారమే పరమావధిగా..ప్రజల్ని, దేశాన్ని, చివరికి సొంత తల్లినీ, తండ్రినీ, బిడ్డల్నీ అన్యాయం చేయడానికీ..అంతం చేయడానికీ వెనుకాడని ప్రమాదకర ధోరణులు ప్రజాస్వామ్యంలో పొడసూపుతున్నాయి. ఓటేసే ప్రజలకు వేటేసే అవకాశం లేదు. అందుకే కుర్చీ కోసం కొట్టుకుంటూ కుమ్ముకుంటున్నారు. ఉత్తరదిక్కుకు వెళితే..తనయుడుతో తండ్రి ఢీ అంటాడు. దక్షిణాదికొస్తే అధికారం కోసం అర్రులు చాచడంలో ఆది..ఇదే ప్రాంతం అని చెప్పొచ్చు. మామకు తోడుగా వుండి..నీడలా వెంటాడి వెనుకుండి ఒక్కపోటు పొడిచేశాడు. ఆయనే ఇప్పుడు మీడియా పాలిట అపరచాణుక్యుడు. ఉద్యమాలతో సాధించుకున్న రాష్ర్టంలోనూ అధికారమే పరమావధిగా సాగిస్తున్న పరమపదసోపాన పటంలో కొందరు పాముల నోట చిక్కారు. మరికొందరికి నిచ్చెనలు అందాయి. అదను చిక్కడంలేదు కానీ..పదునైన కుట్రలు తెరవెనుక సాగుతున్నాయి. అరవనాట మరో థియరీ. అమ్మా అని అరిచినా కానరాని అమ్మ బొమ్మ పెట్టి ఆడుతున్న ``పవర్``ఫుల్ డ్రామా ..రోజుకో మలుపు తిరిగి రక్తి కట్టిస్తోంది. ప్రపంచంలోనే వ్యక్తిపూజకు పరాకాష్టగా నిలిచిన తమిళనాడులో అధికారం కోసం సాగుతున్న పులిజూదం చూస్తే ..పవర్‌కు ఇంత పవర్ ఉందా అనిపిస్తుంది. చిన్నమ్మా అని పిలవబడే శశికళకు పిల్లలు లేరు. తినడానికి లోటు లేకపోవడమే కాదు..రోజుకు కోటి నోట్లు తిన్నా తరగని సంపద పోగైంది. ఏ లోటూ లేదు. సంపాదించి తరతరాలకు తరగకుండా పిల్లలకు పెట్టాలనీ లేదు. మరెందుకు శశికళకు ఈ ఆరాటం అంటే.. అధికారంలో వున్న మాయ. అధికారంలో వున్న మత్తు. పవర్‌లో వుంటే వచ్చే ఎక్స్‌ట్రా పవర్. అందుకే ఈ కుట్రలు. అధికారం కోసం..అధికారం చేత..అధికారం వలన.. సాధించిన అధికారంతో.. ధిక్కారాన్ని తొక్కేసి.. అందలం ఎక్కేసి.. దాని శాశ్వతం చేసుకోవాలనే భ్రమల్లో నిత్యం కుట్రలూ, కుతంత్రాలతోనే జీవితం సాగిస్తున్నారు మన నేతలు. అందుకే అధికారం వున్న చోట కుట్రలు వుండి తీరుతాయి.

చల్లా మధుసూదనరావు
Monday, January 30, 2017
హృదయ ఖాళీయం //శ‌్రీచమన్
బతుకు పోరులో
గెలుపు దారుల్లో
విజయమో
పరాజయమో
తెలియదు కానీ..
రక్తమోడే మనసుల
క్షతగాత్రగానం
జీతమో! వేతనమో!
కూలో! నాలో!
అమ్ముడుపోయిన
ఓ సరుకు నువ్వు
గమ్యంలేని పయనంవైపు
బడలికలేని నడక
ఎడతెగని
ఆలోచనలపై పడక
దారుణ దారులు
అడ్డదారులు
కన్ఫ్యూజన్
కన్ఫెషన్
ఇంట్లో లేని షుగర్ వంట్లో
బ్లడ్ ప్రెషర్‌తో కొట్టుకుంటున్న
దయలేని హృదయం
కొరికేస్తోన్న కొలెస్టరాల్
హృదయ ఖాళీయం
మనిషి మాయం
అంతా క్యాష్‌లెస్
మనిషితో యూజ్‌లెస్
.........................................................25.01.17
ఎప్పటికీ “యువ“ రాజే!
అరణ్యాన్ని ఏలేది మృగరాజు అయితే.. మైదానంలో సంచరించేది యువరాజు.
వాడి చూపు ఆకలిగొన్న పులిలా ఉంటుంది. వాడి కసి వేటకు వెళ్లే సింహంలా
ఉంటుంది. ఫీల్డింగ్ సమయంలో చీతాను తలపిస్తాడు. ఆటను యుద్ధంలా
భావిస్తాడు. తాను ఆటగాడినని మరిచిపోతాడు. సైనికుడిలా నిలువెల్లా
దేశభక్తి పులుముకుంటాడు. రెచ్చగొడితే రెచ్చిపోతాడు. ఎంతలా అంటే,
ఫ్లింటాఫ్ గొంతు కోస్తానని స్లెడ్జింగ్కు దిగితే.. వాడి వెన్నుముకలాంటి
బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ను ఊచకోత కోసేంతగా! ఆరు బాళ్లు, ఆరు
రకాలుగా, ఆరు దిశలుగా ఆరేసి పరుగులుగా బాదేంతగా! యాక్టర్ కొడుకు
యాక్టరైనా అంతగా రాణించలేదు.
డాక్టర్ కొడుకు డాక్టరైనా తండ్రి పేరు సంపాదించలేదు. కానీ క్రికెటర్ కొడుకు క్రికెటర్ అయ్యాడు. తండ్రి కోరికా కాదు. తల్లి పైరవీ లేదు. దిగ్గజ ఆల్ రౌండరయ్యాడు. తండ్రి పేరు చెప్పుకు తిరిగే బాబులకు చెంపపెట్టులాంటివాడు. తనకూ ఓ మోస్తరు క్రికెటర్‌గా పేరున్నా, కొడుకుతో సత్సంబంధాలు లేకపోయినా, యువరాజ్‌సింగ్ తండ్రినని తరచూ చెప్పుకుంటాడు యోగరాజ్ సింగ్. మనస్సు యవ్వనంతో ఉరకలేస్తుంటే..ఆటైనా, ప్రేమయినా జయించి తీరుతాడు. విజేతగా నిలుస్తాడు. మృత్యువునూ జయిస్తాడు. మృత్యుంజయుడవుతాడు. పేరుకు తగ్గట్టే ఎప్పటికీ యువ రాజు యువరాజే. ప్రేమించినా, కామించినా, రమించినా డ్రామాలాడే ఆటగాళ్లకు, పిట్టల వేటగాళ్లకు భిన్నంగా ప్రేమికురాలిని వెంటేసుకుని తిరిగే ధీశాలి మనోడు.
నీకో నాకో మనుషులెవరికైనా క్యాన్సర్ వచ్చిందని రిపోర్ట్‌లో తెలిస్తే చాలు సగం చచ్చిపోతారు. అదీ నూటికో కోటికో వచ్చే కేన్సర్ అయితే గుండె ఆగి “పోతారు“. ట్రీట్‌మెంట్ ప్రారంభమైన తరువాత ఇక జనానికి కనిపించేందుకు కూడా ఇష్టపడరు. కొంతమంది చికిత్స అయినాక భయంతో పోతారు. టెన్షన్‌తో ప్రాణాలు విడుస్తారు. అయితే వాడు యువరాజ్ సింగ్. మాంచి స్వింగ్ మీదున్నప్పుడు సింగ్ ఈజ్‌ది కింగ్ అనిపించుకున్న సమయంలో పంజా విసిరింది మాయదారి రోగం. అయితే క్యాన్సర్ ను కూడా చాలా సులువుగా బాల్‌ను బౌండరీ లైను దాటించినంత సులువుగా దాటించేసి మైదానంలో అడుగుపెట్టాడు. వన్డే టీమ్‌లోకొచ్చాడు. 20-20 జట్టులో కీలక సభ్యుడయ్యాడు. ఐపీఎల్‌లో అదరగొడుతున్నాడు. మళ్లీ ఆరు బాళ్లకు ఆరు సిక్స్‌లు కొడతానంటున్నాడు. వీడి వాలకం, యవ్వనం, మొండితనం చూస్తుంటే నిజంగా కొట్టేటట్టున్నాడు.
వీడి ప్రేమ సంద్రం. ఎంత అంటే.. తాను ప్రేమించి,పూజించే సచిన్ ప్రత్యర్థి జట్టుకు పెద్దదిక్కుగా ఎదురుగా కనబడితే చిన్నపిల్లాడిలా పాదాలపై పడి దండం పెట్టేంత ప్రేమ. క్రికెట్ గాడ్ ను భుజాలపై ఎక్కించుకుని తిప్పేంత అభిమానం. ప్రేమలాగే కోపమూను. గట్టు తెగిన గోదారిలా ఉరకలెత్తుతుంది. ప్రత్యర్థి జట్టు నుంచి కవ్వింపులొస్తే కాలనాగులా బుసకొడతాడు. బ్యాట్‌కు పనిచెబుతాడు. యువరాజ్ గత ఆటతీరుతో పోల్చుకుంటే క్యాన్సర్ జయించి వచ్చిన ఆడింది అంతంతమాత్రమే. అయినా యవ్వనం పునః సంతరించుకున్న యువరాజు రాజ్యానికి వచ్చిన రాజసం మైదానంలో దిగితే కనబడుతోంది. ఐపీఎల్ ప్రస్తుత సీజన్‌లో సిక్స్ కొడితే అదే రాజ ఠీవి. ఫీల్డ్‌లో చిరుతలా కదలాడుతూ, పాదరసంలా పాదాలను లక్ష్యంవైపు తిప్పుతూ యువీ చేసిన రనౌట్ చూశారా? వీడు ఆడేది క్రికెట్టే కానట్టు ఉంటుంది.
మైదానాన్ని యుద్ధక్షేత్రంగా, తానొక సైనికుడిగా భావిస్తాడేమో! మనిషిలో నిర్లక్ష్యం, మనసులో ఆత్మవిశ్వాసం, చూపులో కసి, లక్ష్యంపై గురి, స్వేచ్ఛా జీవనం, నిర్భీతి గమనం యువరాజ్ బలం, బలహీనతలు. వన్నె తరగని చిన్నోడు.. క్రికెట్ అభిమానుల మనసు దోచేదే మనోడు.. నిత్యయవ్వనం తొణికిసలాడే నవయువకుడు..యువరాజ్ అంటే ఎవరైనా అభిమానించని వారుంటారా? అనే సందేహంతో ఇదంతా! ఉంటే.. బయటపడండి. భయపడని వీరుడుని, మృత్యుంజయుడిని కెలికి చూడండి. స్టువర్ట్ బ్రాడ్‌లా మరొకడెవడో బలవుతాడు.
=======
శ్రీచమన్, జర్నలిస్ట్ srichaman@gmail.com
http://www.cricnkhel.com/telugu/yuvraj-singh-sri-chaman-great-cricketer-super-player-9213/

కోట్లు ఇవ్వడం కాదు..కోర్టులివ్వండి!
పతకాలొచ్చాయి. పథకాలు మొదలయ్యాయి. మెడల్స్ వచ్చాయి.
మేకవన్నెపులులొస్తున్నాయి. నాడు మాటసాయం కూడా చేయలేని వాళ్లు నేడు
కోట్లు ప్రకటించారు. ఆడేటప్పుడు సాయం కూడా అవ్వనివారు..ఇప్పుడు అడిగితే
ఏ సహాయం అయినా చేస్తామంటున్నారు. ఆడేవాడు పతకాలు తెచ్చేవాడు అవకాశం
లేక ప్రేక్షకుడిలా చూస్తున్నాడు. డబ్బుబలంతో..రాజకీయాల అండతో..పైరవీల
అర్హతతో ఓడేవాడు అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు. అందుకే
ఆడేవాళ్లందరినీ ప్రోత్సహించండి..ఒకరో ఇద్దరో గెలిచాక..వారిద్దరికీ
ఇచ్చే కోట్లలో పదో వంతు ఒక్కో క్రీడాకారిణిపై ఖర్చు పెట్టండి. ఒక్కో
క్రీడాకారుడిని తయారు చేయడానికి వెచ్చించండి.
సాక్షి మాలిక్ ఎంతిచ్చినా వద్దనదు. సింధుకు ఎంతడిగినా కాదనరు. 120 కోట్ల మందికి ప్రతినిధులు వారు. ఒలింపిక్స్‌లో మువ్వన్నెల రెపరెపలకు కారకులు వీరు. ఒలింపిక్స్ వెళ్లినవాళ్లే కాదు. వందకోట్లు దాటిన భారతావనిలో గురితప్పని విలుకారులు, పట్టువదలని మల్లయోధులు ఎందరో వున్నారు. కానీ వారికి ప్రోత్సాహం ఎక్కడ?వారికి అవకాశాలు ఏవి? అవును. ఇది ఒక డిమాండ్. పచ్చిగా పచ్చ నోటు సాక్షిగా చేస్తున్న డిమాండ్. వితండ వినతి. 120 కోట్లమందికి 2 పతకాలు వచ్చాయి.
సిగ్గులేదా! ఇష్టపడి ఆడి..కష్టపడి సాధన చేస్తే..ఆ రోజు సాక్షి మాలిక్‌కు ఒక్కడైనా అండగా వున్నాడా? ఆర్థిక సాయం చేశాడా? ఈ కోటానుకోట్ల జనాల్ని ఏలుతున్న ప్రజాస్వామ్య ప్రభువులారా! సకలకళా పోషకులారా! క్రీడలపై క్రీనీడలు ప్రసరింపజేసిన రాజపోషకులారా? గెలిచిన ఇద్దరిపై ఇన్ని కోట్లు గుమ్మరించే బదులు.. కోర్టుల్లేక ఆడలేకపోతున్న వారికి కోర్టులు ఏర్పాటు చేయొచ్చు కదా! బూటు లేక పరిగెత్తలేకపోతున్న పరుగులు రాణులు..రాజులకూ పతకం సాధించ ముందే ఓ షూ కొనివ్వొచ్చు కదా! కండ బలం..గుండె బలం అండగా ఉన్నా ఆదరించే వారు లేక..ఆదుకునే వారు లేక..ఎంతో మంది క్రీడాకారులు..హోటల్లలో సర్వర్లుగా, క్లీనర్లుగా వున్నారంటే…అది మీ పాపం కాదా! స్పోర్ట్స్ క్యాంప్‌లో దోమలు కుట్టి..జ్వరాలొచ్చి..కునారిల్లిపోతున్న క్రీడా ప్రతిభ మీరు ఇచ్చిన శాపం కాదా?
క్రీడాసంఘాలకు అధ్యక్షులలో ఏ ఒక్కడికైనా ఒక ఆటవచ్చా? పారిశ్రామికవేత్తలు, రాజకీయ దళారీల నేతృత్వంలో వివిధ ఆటల పోటీలకు ఎంపికవుతున్న క్రీడాకారుల్లో సత్తా ఎంత? వ‌్యక్తిగత ఇష్టాఇష్టాలతో క్రీడలకు మీరు చేసే ద్రోహం..ఇంకెన్ని దశాబ్దాలపాటు ఇలా రజత, కంచు పతకాల సంబరాలకు పరిమితం చేస్తుందో? ఇప్పటికైనా అర్థం అవుతోందా? మధ్యాహ్న భోజన పథకం కోసమే స్కూల్ వచ్చే పిల్లలున్న మన దేశంలో ..ఎంత మంది అకాడమీలకు వెళ్లి లక్షలు కట్టి ..కోచింగ్ తీసుకోగలరు. బ్యాట్ కూడా కొనుక్కోలేడు. వాడు ఆడగలడు. అంతర్‌జిల్లా పోటీలకు వెళ్లేందుకు బస్‌చార్జీ కూడా వుండదు.
వాడు సత్తా చాటగలడు. కష్టాలకు ఎదురీదేవాడికి ..ఈతకొలనులు చేపపిల్లకంటే సునాయాసంగా దాటేస్తాడు. ఆకలిని జయించిన వాడు ప్రత్యర్థిని జయించలేడా? జీవితంతో పోరాడి గెలిచేవాడు మల్లయుద్ధంలో గెలవలేడా? సమస్యల సుడిగుండంలో.. చిక్కుకుని సమయస్ఫూర్తితో బయటకొస్తున్న రోజువారీ జీవితం కంటే..ఏ పోటీ ఎక్కువ కాదు. పద్మవ్యూహంలోంచి కూడా అభిమన్యుడులా కాకుండా..వెళ్లడమే కాదు..రావడమూ తెలిసిన అభినవ అభిమన్యుల్లెందరో వున్నారు. బతుకులో గెలిచేవాడికి ఆటలో గెలవడం ఓ లెక్కా?.. ఇక్కడ గెలిచే ప్రతివాడూ ..ఒక బోల్ట్, ఒక ఫెల్ఫ్. స్పోర్ట్స్ హాస్టల్‌లో కోటి కలల ఆటగాళ్ల కడుపు నింపండి. నిదురలోనూ ప్రాక్టీస్ చేస్తున్న పరుగు వీరులకు దోమలు కుట్టకుండా కాపాడండి. కోట్లలో కొంత వెచ్చించి..ప్రభుత్వ స్కూళ్లలో మైదానాలు మెరుగుపరచండి. కోర్టులు సిద్ధం చేయండి. క్రీడా పరికరాలు ఉచితంగా అందజేయండి. ఎంపికలో ప్రతిభకు పెద్దపీట వేయండి. ఇవన్నీ అయ్యాక పోటీలకు పంపండి.. వీరు గెలుచుకొచ్చే పతకాలతో మన మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాలి. వీరు విజయ తీరాలకు చేరుతున్నప్పుడు మన గుండెలు ఉప్పొంగిపోవాలి. వందకోట్ల పైబడిన జనం జయజయ విజయధ్వానాలతో ఒలింపిక్స్ మైదానాలు దద్దరిల్లిపోవాలి.
శ్రీచమన్ జర్నలిస్ట్ srichaman@gmail.com
http://www.cricnkhel.com/telugu/pv-sindhu-badminton-govt-performance-11crores-no-courts-yet%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%87%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e2%80%8c%e0%b0%a1%e0%b0%82-%e0%b0%95%e0%b0%be/
సాక్షి మాలిక్ ఎంతిచ్చినా వద్దనదు. సింధుకు ఎంతడిగినా కాదనరు. 120 కోట్ల మందికి ప్రతినిధులు వారు. ఒలింపిక్స్‌లో మువ్వన్నెల రెపరెపలకు కారకులు వీరు. ఒలింపిక్స్ వెళ్లినవాళ్లే కాదు. వందకోట్లు దాటిన భారతావనిలో గురితప్పని విలుకారులు, పట్టువదలని మల్లయోధులు ఎందరో వున్నారు. కానీ వారికి ప్రోత్సాహం ఎక్కడ?వారికి అవకాశాలు ఏవి? అవును. ఇది ఒక డిమాండ్. పచ్చిగా పచ్చ నోటు సాక్షిగా చేస్తున్న డిమాండ్. వితండ వినతి. 120 కోట్లమందికి 2 పతకాలు వచ్చాయి.
సిగ్గులేదా! ఇష్టపడి ఆడి..కష్టపడి సాధన చేస్తే..ఆ రోజు సాక్షి మాలిక్‌కు ఒక్కడైనా అండగా వున్నాడా? ఆర్థిక సాయం చేశాడా? ఈ కోటానుకోట్ల జనాల్ని ఏలుతున్న ప్రజాస్వామ్య ప్రభువులారా! సకలకళా పోషకులారా! క్రీడలపై క్రీనీడలు ప్రసరింపజేసిన రాజపోషకులారా? గెలిచిన ఇద్దరిపై ఇన్ని కోట్లు గుమ్మరించే బదులు.. కోర్టుల్లేక ఆడలేకపోతున్న వారికి కోర్టులు ఏర్పాటు చేయొచ్చు కదా! బూటు లేక పరిగెత్తలేకపోతున్న పరుగులు రాణులు..రాజులకూ పతకం సాధించ ముందే ఓ షూ కొనివ్వొచ్చు కదా! కండ బలం..గుండె బలం అండగా ఉన్నా ఆదరించే వారు లేక..ఆదుకునే వారు లేక..ఎంతో మంది క్రీడాకారులు..హోటల్లలో సర్వర్లుగా, క్లీనర్లుగా వున్నారంటే…అది మీ పాపం కాదా! స్పోర్ట్స్ క్యాంప్‌లో దోమలు కుట్టి..జ్వరాలొచ్చి..కునారిల్
క్రీడాసంఘాలకు అధ్యక్షులలో ఏ ఒక్కడికైనా ఒక ఆటవచ్చా? పారిశ్రామికవేత్తలు, రాజకీయ దళారీల నేతృత్వంలో వివిధ ఆటల పోటీలకు ఎంపికవుతున్న క్రీడాకారుల్లో సత్తా ఎంత? వ‌్యక్తిగత ఇష్టాఇష్టాలతో క్రీడలకు మీరు చేసే ద్రోహం..ఇంకెన్ని దశాబ్దాలపాటు ఇలా రజత, కంచు పతకాల సంబరాలకు పరిమితం చేస్తుందో? ఇప్పటికైనా అర్థం అవుతోందా? మధ్యాహ్న భోజన పథకం కోసమే స్కూల్ వచ్చే పిల్లలున్న మన దేశంలో ..ఎంత మంది అకాడమీలకు వెళ్లి లక్షలు కట్టి ..కోచింగ్ తీసుకోగలరు. బ్యాట్ కూడా కొనుక్కోలేడు. వాడు ఆడగలడు. అంతర్‌జిల్లా పోటీలకు వెళ్లేందుకు బస్‌చార్జీ కూడా వుండదు.
వాడు సత్తా చాటగలడు. కష్టాలకు ఎదురీదేవాడికి ..ఈతకొలనులు చేపపిల్లకంటే సునాయాసంగా దాటేస్తాడు. ఆకలిని జయించిన వాడు ప్రత్యర్థిని జయించలేడా? జీవితంతో పోరాడి గెలిచేవాడు మల్లయుద్ధంలో గెలవలేడా? సమస్యల సుడిగుండంలో.. చిక్కుకుని సమయస్ఫూర్తితో బయటకొస్తున్న రోజువారీ జీవితం కంటే..ఏ పోటీ ఎక్కువ కాదు. పద్మవ్యూహంలోంచి కూడా అభిమన్యుడులా కాకుండా..వెళ్లడమే కాదు..రావడమూ తెలిసిన అభినవ అభిమన్యుల్లెందరో వున్నారు. బతుకులో గెలిచేవాడికి ఆటలో గెలవడం ఓ లెక్కా?.. ఇక్కడ గెలిచే ప్రతివాడూ ..ఒక బోల్ట్, ఒక ఫెల్ఫ్. స్పోర్ట్స్ హాస్టల్‌లో కోటి కలల ఆటగాళ్ల కడుపు నింపండి. నిదురలోనూ ప్రాక్టీస్ చేస్తున్న పరుగు వీరులకు దోమలు కుట్టకుండా కాపాడండి. కోట్లలో కొంత వెచ్చించి..ప్రభుత్వ స్కూళ్లలో మైదానాలు మెరుగుపరచండి. కోర్టులు సిద్ధం చేయండి. క్రీడా పరికరాలు ఉచితంగా అందజేయండి. ఎంపికలో ప్రతిభకు పెద్దపీట వేయండి. ఇవన్నీ అయ్యాక పోటీలకు పంపండి.. వీరు గెలుచుకొచ్చే పతకాలతో మన మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాలి. వీరు విజయ తీరాలకు చేరుతున్నప్పుడు మన గుండెలు ఉప్పొంగిపోవాలి. వందకోట్ల పైబడిన జనం జయజయ విజయధ్వానాలతో ఒలింపిక్స్ మైదానాలు దద్దరిల్లిపోవాలి.
శ్రీచమన్ జర్నలిస్ట్ srichaman@gmail.com
http://www.cricnkhel.com/telugu/pv-sindhu-badminton-govt-performance-11crores-no-courts-yet%e0%b0%95%e0%b1%8b%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b2%e0%b1%81-%e0%b0%87%e0%b0%b5%e0%b1%8d%e0%b0%b5%e2%80%8c%e0%b0%a1%e0%b0%82-%e0%b0%95%e0%b0%be/
బ్యాట్..ట్వీటూ వీరూకొక్కటే!
సెహ్వాగ్ ట్వీటుతోనూ కొడతాడు
విధ్వంసకర ట్వీట్స్‌మెన్ వీరూ
బ్యాట్..ట్వీటూ వీరూకొక్కటే!
బ్యాటుతోనే కాదు..ట్వీటుతోనూ కొడతాడు. క్రీజులోకి దిగి వీరవిహారం
ప్రారంభిస్తే..బౌలర్లు రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరుగుదామా అనేలా బాదేవాడు.
ఇప్పుడు సైటైర్లతో నెటిజన్ల హార్ట్‌లను కొల్లగొడుతున్నాడు. కొందరు
పొలిటీషియన్లను హర్ట్ చేస్తున్నాడు. మైదానంలో దిగితే బౌలర్లకు
చుక్కలు చూపించే వీరూ..ఇప్పుడు రిటైర్ అయి సెటైర్లు పేల్చుతున్నాడు.
ఓపెనింగ్ కు దిగి విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో క్రికెట్ అభిమానుల
మనసు దోచుకున్న వీరేంద్ర సెహ్వాగ్..బ్యాటు వదిలి ట్వీటు బాట పట్టాడు.
ఇక్కడా అదే కొట్టుడు.విధ్వంసకర ట్వీట్స్‌మెన్ వీరూ
బ్యాట్..ట్వీటూ వీరూకొక్కటే!
అయితే ఎప్పుడూ సీరియస్‌గా కనిపించే..వీరూలో ఎంత సెన్సాఫ్ హ్యూమర్ వుందో..అంతే స్థాయిలో మానవత్వమూ వుంది. దేశంలోని సమకాలీన సమస్యలపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ వీరూ ..మైదానంలోనే కాదు..సోషల్ మీడియాలోనూ విపరీతమైన క్రేజ్ సంపాదించాడు. దేశంలో నేతల బర్త్‌డేల సందర్భంగా కాస్త వ్యంగ్యం..మరి కాస్తా వెటకారం..దట్టించి..ప్రేమాభిమా
ఢిల్లీలో వర్షాలు కురుస్తున్నప్పుడు.. పడవ కావాలేమో బజ్జీ ట్వీటు చేస్తే..రెండు పడవలు కొనుక్కోవాలి.. సరి బేసి ట్రాఫిక్ అమలు వుంది జాగ్రత్త అంటూ హాట్ గా రీట్వీట్ చేశాడు సెహ్వాగ్. నరేంద్రమోడీకి బర్త్‌డే విషెస్ చెబుతూ ..క్రికెట్ పరిభాషలో మోడీజీ 66 నాటౌట్..మీరు సెంచరీ చేయాలని స్వీటుగా ట్వీట్ విషెస్ చెప్పాడు. ఇక ఢిల్లీ సీఎం.. కేజ్రీవాల్‌కు కాస్త వ్యంగ్యంగా పుట్టినరోజు శుభాకాంక్షలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు వీరూ.
తరచూ జలుబు, అనారోగ్య సమస్యలతో బాధపడే కేజ్రీవాల్‌కు..ఈ పుట్టినరోజు సందర్భంగా అవన్నీ తగ్గి ఆరోగ్యంగా వుండాలని కోరుకుంటున్నానని ట్వీట్ గ్రీటింగ్స్ పంపాడు. యురి సెక్టార్‌లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ..వారికి కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించిన ట్వీటులోనూ వీరేంద్ర సెహ్వాగ్ తనలోని దేశభక్తిని, సైనికశక్తిపై వున్న ప్రేమను మరోసారి చాటాడు.
“17 మంది ప్రాణాలు. వారికీ కుటుంబాలున్నాయి. వాళ్లకూ కొడుకులున్నారు. కూతుళ్లున్నారు. వారు మాతృభూమికోసం సేవ చేశారు. ఈ దృశ్యం చూసేందుకు బాధగా ఉంది. యూరీ దాడి ఘటన విని నా గుండె తరుక్కుపోతోంది. దాడి చేసిన వారు తిరుగుబాటుదారులు కాదు. వారు ఉగ్రవాదులే. ఉగ్రవాదానికి సరైన సమాధానం ఇచ్చితీరాలి“ అని ట్వీటు చేసి..17 మంది సైనికుల పార్థివదేహాలున్న ఫోటోలను పోస్టు చేశాడు.
బ్యాటు..ట్వీటు రెండూ కూడా ఒకేలా వాడుతున్న వీరేంద్ర సెహ్వాగ్‌లో ఒక విమర్శకుడున్నాడు..మరో విశ్లేషకుడు దాగున్నాడు. వీరేంద్ర సెహ్వాగ్‌లో ఒక సీరియస్ రైటర్ అంతర్లీనంగా వున్నాడు. చరిత్ర, రాజకీయాలు, సామాజిక వర్తమాన సమకాలీన అంశాలపై పూర్తి స్థాయి అవగాహనతో వున్న వీరేంద్ర సెహ్వాగ్…ట్విట్టర్ వేదికగా క్రీజులో చెలరేగినట్టుగానే చెలరేగిపోతున్నాడు. అవుట్ స్వింగర్ అయినా, ఇన్ స్వింగర్ అయినా, యార్కర్ అయినా, స్లో డెలివరీ అయినా, గూగ్లీ అయినా, దూస్రా అయినా, చివరికి బౌన్సర్‌నైనా బౌండరీకి దాటించే సత్తా వీరూ బ్యాటుది.
ఇప్పుడు విషాదమైనా, ఆనందమైనా, కష్టమైనా, నష్టమైనా, వ్యంగ్యమైనా, భిన్నమైన అంశాలపై..వాటికనుగుణంగా స్పందిస్తూ ట్వీటే ఆలోచనా శక్తి సెహ్వాగ్‌ది. అందుకే వీరేంద్ర సెహ్వాగ్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా.. వివేచన, వివేకం, దేశభక్తి, వ్యంగ్యం కలగలిసిన ట్వీట్స్‌మెన్‌గానూ రికార్డులు సృష్టిస్తున్నాడు.
శ్రీచమన్, జర్నలిస్ట్
srichaman@gmail.com
http://www.cricnkhel.com/telugu/virendra-sehwag-indian-cricketer-twitter-chall-madhu-cricnkhel-com-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%9f%e0%b1%8d%e2%80%8c-%e0%b0%9f%e0%b1%8d%e0%b0%b5%e0%b1%80%e0%b0%9f%e0%b1%82-%e0%b0%b5/
Subscribe to:
Posts (Atom)